https://oktelugu.com/

Corona: కరోనాతో ఇక సహవాసమే.. దేశంలో ‘ఎండెమిక్’ స్టేజీలోకి కరోనా?

Corona: కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఉంటుందా..? ఉండదా..? ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకడం ఆగిపోయిందా..? కొవిడ్ భారత్ లో ఏ స్టేజీలో ఉంది..? ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలతో చాలా మంది భారతీయులు అయోమయానికి గురవుతున్నారు. థర్డ్ వేవ్ వస్తుందని కొందరు.. సెకండ్ వేవ్ అంతగా కేసులు పెరగలేవని కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ శాస్త్రవేత్త స్వామినాథన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత్ లో కరోనా కేసులు ప్రస్తుతం […]

Written By: , Updated On : September 4, 2021 / 09:14 AM IST
Follow us on

Corona: కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఉంటుందా..? ఉండదా..? ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకడం ఆగిపోయిందా..? కొవిడ్ భారత్ లో ఏ స్టేజీలో ఉంది..? ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలతో చాలా మంది భారతీయులు అయోమయానికి గురవుతున్నారు. థర్డ్ వేవ్ వస్తుందని కొందరు.. సెకండ్ వేవ్ అంతగా కేసులు పెరగలేవని కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ శాస్త్రవేత్త స్వామినాథన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత్ లో కరోనా కేసులు ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. ఇదే సమయంలో స్వామినాథన్ ఇండియాలో కరోనా ‘ఎండెమిక్’ స్టేజీలో ఉందని అన్నారు. అయితే ఎండమిక్ అంటే ఏమిటి..? భారత్ లో కరోనా ఏ స్టేజీలో ఉంది..?

కరోనా వైరస్ భారత్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పటి వరకు వైరస్ తో 4 లక్షల 35 వేల మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిత్యం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. ఓవైపు వ్యాధి సోకిన వారికి చికిత్స అందిస్తూనే మరోవైపు వైరస్ సోకకుండా జాగ్రత్తలు చెబుతోంది. ఇదిలా ఉండగా అక్టోబర్లో భారత్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చేఅవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ స్వామినాథన్ మాత్రం ఎండమిక్ స్టేజీలోకి భారత్ వెళ్లిందని అంటున్నారు.

ఎండమిక్ అంటే ఒక వ్యాధి శాశ్వతంగా మనమధ్యే ఉండిపోవడం. అంటే కరోనా రాకముందు మన మధ్య ఉన్న మశూచి, తట్టూ, హైపటైటిస్-ఎ, హైపటైటిస్-బి లాంటి వ్యాధులు మనుషుల మధ్య ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు కరోనా కూడా ఉంటుందని స్వామినాథన్ చెప్పిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. కోవిడ్ ఎలా పుట్టిందో ఎవరూ నిర్దారించలేదు. దీంతో ఇప్పుడు ఆ వైరస్ ఎండమిక్ గా మారే అవకాశం ఉందా..? అని కొందరు వైద్య నిపుణులు అనుమానపడుతున్నారు. పాండమిక్ అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం. ఎండెమిక్ అంటే జనాల మధ్యే వ్యాధి ఉన్నా మరణించేంతగా ఉండకపోవచ్చు.

కరోనా వైరస్ సోకకుండా ఇప్పటికే అనేక దేశాలు వ్యాక్సిన్లు తీసుకొచ్చాయి. అయితే భారత్ లో వ్యాక్సినేషన్ 15 శాతం మాత్రమే పూర్తయింది. ఒకవేళ వ్యాక్సినేషన్ ఎక్కువగా అయితే వైరస్ ఎండమిక్ గా మారే అవకాశం ఉందని కొందరు వైద్యనిపుణులు తెలుపుతున్నారు. అంటే బ్రిటన్లో 60 శాతం మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. అక్కడ వైరస్ మనుషుల మధ్య ఉన్నా తీవ్రమైన వ్యాప్తి లేదు. అయితే భారత్ లో ఎండమిక్ స్టేజీకి రావాలంటే మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ పూర్తవడంతో పాటు ప్రజల అలవాట్లలో మార్పులు రావాలని అంటున్నారు.

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ను ఎవరూ ఊహించలేదు. దీంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెంది అత్యధిక మరణాలు సంభవించాయి. అయితే కొన్ని రోజులు కేసులు పెరిగి ఆ తరువాత తగ్గుముఖం పట్టాయి. అంటే సెకండ్ వేవ్ మొత్తం పాండమిక్ అన్నమాట. ఇప్పడు కేసుల పెరుగదల లేదు. నిలకడగా ఉంది. అందువల్ల ఇప్పుడ ఎండెమిక్ అనొచ్చు అని అంటున్నారు.

కొవిడ్ ఎండమిక్ స్టేజీకి మారితో బూస్టర్ డోస్ అవసరమవుతుందని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. దేశంలో ప్రస్తుతం రెండు డోసులు మాత్రమే ఇస్తున్నారు. అయినా కొందరికి వైరస్ సోకుతుంది. దీంతో ఇటీవల కొందరికి బూస్టర్ డోస్ వేసి ట్రయల్ నిర్వహించారు. ఒకవేళ కరోనా వైరస్ తీవ్రత తగ్గితే బూస్టర్ డోస్ అవసరం ఉండకపోవచ్చంటున్నారు. లేకపోతే బూస్టర్ డోస్ వేసుకోవాలని చర్చిస్తున్నారు. ఏ నిర్ణయమైనా వైరస్ వ్యాప్తిని భట్టి ఉంటుందని అంటున్నారు.