AP Corona: ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మహమ్మారి తీవ్రత పెరుగుతూనే ఉంది. పరిస్థితులు చూస్తుంటే అదుపు తప్పేలానే కనిపిస్తోంది. కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
ఏపీలో గడిచిన 24 గంటల్లో 47420 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 12615 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల గడిచిన 24 గంటల్లో విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా బారినుంచి నిన్న 3674 మంది పూర్తిగా కోలుకున్నారు.
Also Read: పది అర్హతతో మంచి వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 53871 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2338, విశాఖ జిల్లాలో 2117 కరోనా కేసులు నమోదయ్యాయి.
చూస్తుంటే థర్డ్ వేవ్ ఏపీలో ఖాయంగా కనిపిస్తోంది. ఒక్కరోజులోనే దాదాపు డబుల్ కేసులు కావడం.. వైరస్ విస్తృతిని సూచిస్తోంది. దీన్ని బట్టి ఏపీలో కరోనా విజృంభిస్తోందని తెలుస్తోంది.
ఏపీలో రోజురోజుకు కేసులు డబుల్ అవుతున్నా దృష్ట్యా థర్డ్ వేవ్ వచ్చేసిందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మరిన్ని ఆంక్షలు తప్పవని అంటున్నారు. సెకండ్ వేవ్ సమయంలో నమోదైన కేసుల స్థాయిలో ఇప్పుడు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: ప్చ్.. మరో స్టార్ హీరోకి కరోనా పాజిటివ్ !