Devotional: సాధారణంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు దేవుడిని ప్రార్థించడం సర్వ సాధారణంగా చేసే పనే. అయితే చాలా మంది వారి కోరికలను బట్టి దేవునికి ప్రార్థన చేయడం చేస్తుంటారు. కానీ దేవుడికి నమస్కరించేటప్పుడు లేదా కోరిన కోరికలు నెరవేరాలంటే భగవంతుడుని ఈ క్రింద తెలిపిన విధంగా ప్రార్థించాలి.
నీవు బ్రతికినంత కాలం ఎప్పుడు ధార్మిక కార్యక్రమాలు నీ సంపదతో చేయాలని ప్రార్థించాలి. అంటే ఎప్పుడూ కూడా నీవు ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండాలని అర్థం. అదేవిధంగా నా ఇంట్లో దైవానికి ఎప్పుడు నిత్య నైవేద్యం ఉండాలని కోరుకోవడం అంటే మన ఇంట్లో ఎప్పుడూ ధాన్యం కొలువై ఉండాలని అర్థం. నా ఇంట్లో దైవానికి నిత్య పూజ చేయాలని కోరుకోవాలి.ఇలా కోరుకోవడం వల్ల మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని అర్థం ఆరోగ్యంగా ఉన్నప్పుడే భగవంతుని ప్రార్థించే ఓపిక ఉంటుంది.
నా ఇంటికి ఎప్పుడు ఎవరు వచ్చినా వారు కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలని కోరుకోవాలి. ఇలా కోరుకున్నప్పుడు సరైన జీవిత భాగస్వామి మనకు దొరుకుతుంది. నేను నా చివరి దశ వరకు దైవ క్షేత్రాలను సందర్శించాలని కోరుకోవాలి అంటే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించమని అర్థం. చివరికి ముత్తైదువు గా కాలం చేయాలని కోరుకోవాలి. ఇలా కోరుకోవటం వల్ల భర్త దీర్ఘాయుష్షును కలిగి ఉంటాడు. ఈ విధంగా భగవంతుడిని కోరుకోవాలని పండితులు చెబుతున్నారు.