
ఆంధ్రప్రదేశ్‌లో జరుపుతున్న కరోనా టెస్ట్ ల నాణ్యత పట్ల ఒక వంక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నా, మరోవంక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
వారం క్రితం రోజూ 70, 80కు పైగానే కేసులు నమోదవ్వగా.. గత నాలుగైదు రోజులుగా కేసులన్నీ 30, 40కు మించి పెరగలేదు. దానితో కరోనా ఉధృత తగ్గుముఖం పట్టిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భరోసా వ్యక్తం చేస్తున్నది. ఏ జిల్లాలో కూడా రెండంకెల కేసులు నమోదు కాలేదు.
గత 24 గంటలుగా 38 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2018కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 7,409 మందికి పరీక్షలు చేయగా 38మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇవాళ నమోదైన కొత్త కేసుల్లో అనంతపురం 8, చిత్తూర్ 9, గుంటూరు 5, కృష్ణా 3, కర్నూల్ 9, నెల్లూరు 1, విశాఖపట్నం 3 చొప్పున ఉన్నాయి. ఇప్పటి వరకూ కర్నూల్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 572 కాగా గుంటూరు-387, కృష్ణా-342గా ఉన్నాయి.
ఇలా ఉండగా, ఏపీలో కరోనా ఇన్ఫెక్షన్ రేటు ఆదివారం 1.14 శాతంగా నమోదైంది.