రాష్ట్రంలో 1000 దాటిన కరోనా కేసులు!

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ క్రమంగా పెరిగిపోతూనే ఉంది… నేటికి కేసుల సంఖ్య వెయ్యికి చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 61 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. నిన్న 61 కొత్త కేసులు నమోదు కాగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 1,016కు చేరింది. ఇప్పటి వరకు 171 మంది […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 1:33 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ క్రమంగా పెరిగిపోతూనే ఉంది… నేటికి కేసుల సంఖ్య వెయ్యికి చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 61 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. నిన్న 61 కొత్త కేసులు నమోదు కాగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 1,016కు చేరింది. ఇప్పటి వరకు 171 మంది డిశ్చార్జ్ కాగా.. 31 మంది మృతిచెందారు.. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 814 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, 24 గంటల్లో ఇద్దరు మృతిచెందారు.

గత 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదు అయ్యాయి… కర్నూలులో 14 నమోదు కాగా… అనంతపురంలో 5, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 3, కడపలో 4, నెల్లూరులో 4, శ్రీకాకుళం 3 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 6,928 శాంపిల్స్‌ను పరీక్షించగా 61 పాజిటివ్‌గా వచ్చాయి. ఇక, కర్నూలులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందగా.. మృతుల సంఖ్య 31కి చేరింది. 259 కేసులో కర్నూలు.. ఏపీలో అగ్రస్థానంలో ఉండగా.. గుంటూరులో 209, కృష్ణా జిల్లాలో 127 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో క్రమంగా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయం.