ఆ గన్ తో గురి చూసి కరోనాను కనిపెట్టొచ్చు

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 26 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చేవారికి వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల కేసులు మరింత పెరగకుండా నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, నోయిడాలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆగ్రాలో పర్యాటకులకు వైద్య పరీక్షలు నిర్వహిసున్నారు. తాజ్‌మహల్‌కు వచ్చే పర్యాటకులను థర్మల్ గన్ తో చెక్ చేస్తున్నారు. దేశంలో అనుమానాస్పద కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజ్ మహల్ సమీపంలో థర్మల్ గన్ […]

Written By: Neelambaram, Updated On : March 5, 2020 4:53 pm
Follow us on

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 26 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చేవారికి వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల కేసులు మరింత పెరగకుండా నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, నోయిడాలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఆగ్రాలో పర్యాటకులకు వైద్య పరీక్షలు నిర్వహిసున్నారు. తాజ్‌మహల్‌కు వచ్చే పర్యాటకులను థర్మల్ గన్ తో చెక్ చేస్తున్నారు. దేశంలో అనుమానాస్పద కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజ్ మహల్ సమీపంలో థర్మల్ గన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులలో థర్మల్ ఇంటర్నేషనల్ ఇమేజరీ పరికరాల తో పరీక్షిస్తున్నారు.

ముఖ్యంగా చైనా, ఇంగ్లాండ్, హాంకాంగ్, సింగపూర్, జపాన్, కొరియా వంటి దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ జరుగుతోంది. నిపుణుల తెలిపినదాని ప్రకారం, కరోనా వైరస్ లేదా ఇలాంటి ఇతర వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని థర్మల్ గన్ తో పరీక్షించడం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. థర్మల్ స్క్రీనింగ్ సమయంలో ఆరోగ్యకరమైన వ్యక్తి కి వైరస్ తో బాధపడుతున్న వ్యక్తి మధ్య స్పష్టమైన వ్యత్యాసం తెలుసుకోవచ్చు.

థర్మల్ గన్ లు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి, దీని ప్రారంభ ధర రూ .3 వేల నుండి రూ .50 వేల వరకు ఉంటుంది. దీన్ని ఇంటి నుండి ఆర్డర్ చేయవచ్చు. అయితే స్క్రీనింగ్ సమయంలో నిపుణుల సహాయం అవసరమని ఉత్పత్తిదారులు చెబుతున్నారు.