Mumbai bar raided: దేశంలోని ప్రముఖ నగరాల్లో విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతోంది. దీనిపై ఇప్పటికే పలు ఆధారాలు లభించినా ఏం చేయని పరిస్థితి. దీంతో అటు విటులు, ఇటు వ్యభిచారం నిర్వహించే రీసార్ట్స్ లు, బార్ లు, ఫామ్ లు రెచ్చిపోతున్నాయి. గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నాయి. ఏదో దొరికినప్పుడు ఫార్మాలిటీగా జైల్లో పెడుతున్నారే తప్ప శిక్షలు కూడా ఉండటం లేదు. దీంతో ఎవరికి భయం లేకుండా పోతోంది. ఈ క్రమంలో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతోంది.

గతంలో బెంగుళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ముంబైలో ఓ బార్ లో పోలీసులు తనిఖీ చేయగా గుట్టు రట్టయింది. అంథేరీలోని దీప బార్ లో సోషల్ సర్వీస్ విభాగ పోలీసులు తనిఖీ చేయగా ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి.
బార్ బేస్ మెంట్ గోడలో 17 మంది యువతులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బార్ యాజమాన్యం చేస్తున్న దురాగాతాలను చూసి పోలీసులు హతాశులయ్యారు. రాత్రి సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి జరుగుతున్న తంతును గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంది.
Also Read: PM Modi in Varanasi: కాశీలో కాలినడక.. ప్రధాని మోడీ అభివృద్ధి పైనే ప్రత్యేక దృష్టి
పోలీసులు సోదాలు చేస్తుండగా బార్ లోపల పరిశీలిస్తుండగా ఓ అద్దం వారిని అనుమాన పడేలా చేసింది. దీంతో దాన్ని పరిశీలించగా దాని వెనుక దాగి ఉన్న డ్యాన్సర్లను గుర్తించారు. బార్ యాజమాన్యం చేస్తున్న పాడు పనికి అందరు ఆశ్చర్యపోయారు. దీంతో బార్ మేనేజర్, క్యాషియర్ తోపాటు డ్యాన్సర్లను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Also Read: Narendra Modi: ఇందుకే మోడీ.. ప్రజల మనుసు గెలిచేది?