హైదరాబాద్ లో కరోనా కట్టడిలో సమన్వయ లోపం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతున్నా కట్టడిలో అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. జీహెచ్‌‌ఎంసీ, మెడికల్‌‌, పోలీస్ శాఖల తీరు ఎవరికి వారే అన్నట్టుగా సాగుతోంది. కంటెయిన్మెంట్ల నిర్వహణలోని అధికారులు తీవ్రంగా వైఫల్యం చెందుతున్నారు. గ్రేటర్‌‌లో కేసులు భారీగా పెరుగుతుండగా, కట్టడిపై ఫోకస్ చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. పాజిటివ్‌‌ కేసు నమోదైన చోట కంటెయిన్మెంట్‌‌ జోన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. గడువు ముగిశాక ఎత్తేస్తున్నారు. మొన్నటిదాకా ఉన్న […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 4:22 pm
Follow us on


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతున్నా కట్టడిలో అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. జీహెచ్‌‌ఎంసీ, మెడికల్‌‌, పోలీస్ శాఖల తీరు ఎవరికి వారే అన్నట్టుగా సాగుతోంది.

కంటెయిన్మెంట్ల నిర్వహణలోని అధికారులు తీవ్రంగా వైఫల్యం చెందుతున్నారు. గ్రేటర్‌‌లో కేసులు భారీగా పెరుగుతుండగా, కట్టడిపై ఫోకస్ చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. పాజిటివ్‌‌ కేసు నమోదైన చోట కంటెయిన్మెంట్‌‌ జోన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. గడువు ముగిశాక ఎత్తేస్తున్నారు.

మొన్నటిదాకా ఉన్న కంటెయిన్మెంట్‌‌ జోన్ల స్వరూపం కాస్త హోం క్వారంటెయిన్ గా మారింది. ఒకటి, రెండు ఇండ్లకు మాత్రమే బారికేడ్లు పెట్టి రాకపోకలు బంద్ పెడుతున్నారు. స్థానికులు బయట తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.

వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉన్నతాధికారులు సమీక్షలు అయితే నిత్యం జరుగుతూనే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో లో మాత్రం నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. లోపాలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం గ్రేటర్‌‌ పరిధిలో 100 వరకు హోమ్‌‌ క్వారంటెయిన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అవి ఎక్కడెక్కడున్నాయో కూడా అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

హోం క్వారంటెయిన్లో ఉన్న వాళ్లు బయట తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఉల్లంఘనలకు బాధ్యత వహించాల్సిన అధికారులు ఒక శాఖపై మరొకరు నెట్టేసుకుంటున్నారు. వారి బాధ్యత ఎవ్వరితో అన్న విషయమై స్పష్టత కనబడటం లేదు.

కంటెయిన్మెంట్‌‌ జోన్లలో కొత్త కేసులు నమోదవడం లేదని, ఆంక్షలు సడలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటి వివరాలు మాత్రం చెప్పడం లేదు.