టీపీసీసీని రేవంత్ కొన్నాడు: కాంగ్రెస్ లో చిచ్చు?

తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని చేయడంతో సీనియర్లలో కోపం కట్టలు తెంచుకుంది. ఇన్నాళ్లు పార్టీకి విధేయులుగా ఉన్నా తమ మాటలను ఎందుకు విశ్వసించడం లేదని ప్రశ్ణించారు. గతంలోనే రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వంపై వీహెచ్ సహా పలువురు సీనియర్లు వద్దంటే వద్దు అని తెగేసి చెప్పారు. రేవంత్ తప్ప మరెవరైనా ఫర్వాలేదని చెప్పినా అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి వర్గానికి చెందిన వారినే చేయాలనుకుంటే కోమటిరెడ్డి […]

Written By: Raghava Rao Gara, Updated On : June 27, 2021 8:49 pm
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని చేయడంతో సీనియర్లలో కోపం కట్టలు తెంచుకుంది. ఇన్నాళ్లు పార్టీకి విధేయులుగా ఉన్నా తమ మాటలను ఎందుకు విశ్వసించడం లేదని ప్రశ్ణించారు. గతంలోనే రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వంపై వీహెచ్ సహా పలువురు సీనియర్లు వద్దంటే వద్దు అని తెగేసి చెప్పారు. రేవంత్ తప్ప మరెవరైనా ఫర్వాలేదని చెప్పినా అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి వర్గానికి చెందిన వారినే చేయాలనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించాలని సూచించారు.

అయినప్పటికి అధిష్టానం తను అనుకున్నదే తడవుగా రేవంత్ రెడ్డికి అధికారాలు కట్టబెడతుతూ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతోంది. దీనిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్లు తనకు తెలిసిందని చెప్పారు.

కాంగ్రెస్ లో ఉద్దండులున్నా వారెవరికి అవకాశం ఇవ్వకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుడికి పట్టం కట్టడమేమిటని నేతలు వాపోతున్నారు. జానారెడ్డి, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ లాంటి సీనియర్లు ఉండగా కొత్తగా వచ్చిన వారికి పట్టం కట్టడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. అయినా సీనియర్లు ఎందుకు పనికిరారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీని పట్టుకుని వేలాడిన తమను కాదని ఆయనకు పదవి ఇవ్వడంలో మతలబేమిటో ఇప్పటికి అర్థం కావడం లేదని నేతలు వాపోతున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్నారు. కాంగ్రెస్ కూడా టీడీపీ మాదిరి మారబోతోందన్నారు. టీపీసీసీలో కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. రేపటి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. తనను కలిసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సహా ఎవరు కలిసేందుకు ప్రయత్నించవద్దని సూచించారు.