MLA Rajasingh Arrested: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20న మునావర్ ఫారూఖీ షో నిర్వహించొద్దంటూ ఎమ్మెల్యే వారించడానికి ప్రయత్నించారు. కానీ ప్రభుత్వం మొండిపట్టుదలతో ముందుకెళ్లింది. దీంతో రాజాసింగ్ షో నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును విమర్శించారు. ఈ మేరకు ముస్లింల దేవుడు మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద ఆరోపణలు చేశారనే అభియోగంపై కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో ఎంఐఎం నేతలు రాజాసింగ్ వ్యాఖ్యలపై ఆందోళన నిర్వహించారు. ప్రవక్తపై చేసిన ఆరోపణలు యూట్యూబ్ లో ప్రసారం కావడంతో ఎంఐఎం నేతల ఆందోళన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా రాజాసింగ్ పై కేసులు నమోదు కావడంతో ఆయన ఇంటివద్దే పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫారూఖీ షో వద్దంటూ బీజేవైఎం కూడా ఆందోళన చేసినప్పటికి ఫలితం లేకపోయింది. దీంతో ప్రభుత్వ తీరును విమర్శించారు.
రాజాసింగ్ మాత్రం తాను ధర్మం కోసం మాట్లాడానని ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేయలేదని స్పష్టం చేస్తున్నారు. పార్టీ కోసం కాకుండా ధర్మం కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రకటించారు. ధర్మం పాటించడానికే తాను పాటుపడతామని చెప్పడం విశేషం. ఫారూఖీ మాత్రం రాముడు, సీతలపై ఎంతటి వ్యాఖ్యలు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. తనను అకారణంగా అరెస్టు చేశారని నిరసన తెలిపారు. దీనిపై పార్టీ కూడా ఆందోళన నిర్వహించింది.
మహ్మద్ ప్రవక్తపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా ఎందుకు అరెస్టు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. రాజాసింగ్ ను అరెస్టు చేయడంతో ఆయన ఇంటి ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి రాష్ర్టంలో ఏం జరుగుతోంది. ప్రభుత్వం కావాలనే రెచ్చగొడుతూ చోద్యం చూస్తుందనే విమర్శలు సైతం వస్తున్నాయి. రెండు వర్గాల మధ్య గొడవలు రేపుతూ తాము లౌకిక వాదులమని చెప్పుకుంటుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందుతుందని ఎద్దేవా చేస్తున్నారు.