తిరుమల శ్రీనివాసుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు.. రోజులకే 3 కోట్ల నుంచి 10కోట్ల దాకా ఆదాయం సంపాదించగల అపర కుబేర స్వామివర్యులు. అలాంటి దేవుడి సన్నిధిలో కొలువంటే ప్రపంచంలోనే బెస్ట్ జాబ్ అన్నట్టు. అంతటి జీతాలు.. భత్యాలు.. పైగా ఆ కలియుగ శ్రీ వేంకటేశ్వరుడి చెంతలో సేదతీరడం.. అంతకంటే ఏముంటుంది అని అందరం కలలుగంటాం.. కానీ ఇాది నాణేనికి ఒకవైపు మాత్రమే.. రెండోవైపున చాలీచాలని జీతాలు ఇచ్చే వారిని కూడా తీసేసిన దైన్యం కనిపిస్తోంది.
జగన్ కొలువులో సలహాదారు.. రాజీనామా వెనుక కథేంటి?
*1400మంది పొట్టకొట్టిన టీటీడీ
అసలే కరోనా టైం.. తినడానికి తిండి లేక.. ఉద్యోగాలు లేక.. ఉపాధి కోల్పోయి అందరూ ఇంట్లోనే ఉంటున్న టైం. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రపంచంలోనే అత్యంత కుబేరులైన దేవాలయ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న 1400మంది అవుట్ సోర్సింగ్ కార్మికులను తొలగించడం అన్యాయమని తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దేశంలో ఏ ఒక్క కార్మికుడిని విధుల నుంచి తొలగించరాదని.. వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించినా టీటీడీ పెద్దలు మాత్రం ఒక్క కలంపోటుతో ఉద్యోగులను తొలగించడం సరికాదని పవన్ ఆక్షేపించారు. 15 ఏళ్లుగా టీటీడీలో పనిచేస్తూ తక్కువ జీతాలు తీసుకునే వీరికి సంపన్న టీటీడీ జీతాలు ఇవ్వలేదా అని పవన్ ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పవన్ కళ్యాణ్ తాజాగా టీటీడీని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
*పేరుకు ధనికబోర్డు.. పేద అరుపులు
ప్రపంచంలోనే ఎవరికి రానంత ఆదాయాన్ని ఆ తిరుమలేషుడు టీటీడీకి తెచ్చిపెడుతున్నాడు. ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అధిక ఆదాయాన్ని పొందుతున్న టీటీడీ చైర్మన్ పదవి కోసం రాజకీయనేతలు కొట్టుకుంటారు. ఇక ఇందులో డైరెక్టర్ పదవినైనా పొందాలని ఆరాటపడుతుంటారు. దేవుడి సేవ.. ప్లస్ ఆదాయం బాగుంటుందని తపిస్తారు. కానీ ఇన్ని కోట్లు అచ్చే బోర్డు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అదీ చాలీ చాలని జీతాలు పొందేవారిని తొలగించడం దారుణంగా ఉంది.
మోదీకి లాక్ డౌన్ విషయంలో దిక్కు తోచడం లేదా!
*ప్రభుత్వమైనా స్పందించాలి..
టీటీడీ బోర్డులో ఆది నుంచి అన్ని గందరగోళాలే నడుస్తాయి. కనీసం ఏపీ ప్రభుత్వమైనా ఈ విషయంలో చొరవతీసుకోవాలి. లేకపోతే కార్మికుల కడుపు కొట్టిన వారు అవుతారు.
*కేంద్రం ఆదేశాలు పట్టించుకోరా.?
స్వయంగా లాక్ డౌన్ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చాడు. ఏ ఒక్క ప్రైవేట్ సంస్థ కానీ ప్రభుత్వం సంస్థలు కానీ ఉద్యోగులను తీసివేయకూడదని.. ఇక కేంద్ర కార్మికశాఖ కూడా ఉద్యోగులను తీసివేయకుండా హెల్స్ లైన్ నంబర్లను కేటాయించింది. ఎవరినైనా తీసివేస్తే ఈ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని కోరింది. ఇలా ఇన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా టీటీడీ అవుట్ సోర్సింగ్ కార్మికులను రోడ్డున పడేయడం దారుణంగా ఉంది.. జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చేవరకు ఇంతటి దారుణం జరిగిందని ఎవ్వరూ ఊహించలేదు. ఒక్క అవుట్ సోర్సింగ్ అనే కాదు.. ఇప్పటికే జర్నలిస్టులు.. వివిధ ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు సైతం రోడ్డున పడ్డారు. వారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది.