మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జయంతి సందర్భంగా ఆయన `ఆత్మహత్య’ను రాజకీయ ఆయుధంగా వాడుకొనే ప్రయత్నం టిడిపి, వైసిపి నాయకులు మరోసారి చేశారు. ఆయన ఆత్మహత్యకు మీరంటే మీరే కారణం అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకోవడమే గాని `ఆత్మహత్య’ మిస్టరీని ఛేదించడం పట్ల ఎవ్వరు ఉత్సాహం చూపకపోవడం గమనార్హం.
జగన్ కొలువులో సలహాదారు.. రాజీనామా వెనుక కథేంటి?
గుంటూరు జిల్లా రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన కోడెల ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఒక విషాదకర పరిణామమే. అందుకు కుటుంభం సమస్యలు ప్రధాన కారణం అని భావిస్తున్నప్పటికీ రాజకీయంగా అధికార పక్షంతో పాటు, స్వపక్షంలో కూడా పరాభవం ఎదురవుతూ ఉండడంతో అసహనంతో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కోడెల మృతి చెందిన సమయంలో ఏపీలో వైసిపి అధికారంలో ఉండగా, ఆయన మృతి చెందిన తెలంగాణలో సహితం వైసిపి మిత్రపక్షం టి ఆర్ ఎస్ అధికారంలో ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు కలిసే ఈ మిస్టరీని చేదింప వలసిన అవసరం ఉంది. అయితే అందుకు వారెవ్వరూ ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు.
ట్రాఫిక్ ఫ్రీ నగరంగా రాజధాని.. మాస్టర్ ప్లాన్!
మరణించిన సమయంలో కోడెలను దాదాపు పార్టీకి దూరంగా ఉంచుతూ వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు వైసిపి క్రూర రాజకీయానికి కోడెల మృతి చెందారంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైసిపి నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారని మండిపడ్డారు. మానసికంగా కుంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని దుయ్యబట్టారు.
అయితే కోడెల జయంతిని పురస్కరించుకుని ఆయన ఆత్మహత్యను వైఎస్సార్‌సీపీ మీదకు నెట్టాలని ప్రతిపక్ష నేత చూస్తున్నారని అంటూ ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. పైగా ఓటమి చెందిన తర్వాత కోడెల పట్ల బాబు దుర్మార్గ వైఖరే ఆత్మహత్యకు కారణమని అంటూ తమ ప్రభుత్వం కేసుల పేరుతో వేధింపులకు గురిచేసింది నిజమే అని పరోక్షంగా అంగీకరించారు.
‘ఇంతకీ కోడెల శివప్రసాద్ సెల్‌ఫోన్ ఏమైనట్టు! ఫార్మాట్ చేయకుండా బయటపెట్టగలరా’ అని ప్రశ్నిస్తూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఈ విషయమై టిడిపి వారిని ప్రశ్నిపకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని లోతైన దర్యాప్తు జరిపామని కోరితే మరింత బాధ్యతాయుతంగా ఉండెడిది.
కారణం ఏమైనా హైదరాబాద్ పోలీసుల విచారణకు కోడెల కుటుంభం సభ్యులు కూడా సహకరించడం లేదనే వాదనలు ఉన్నాయి. అటు టిడిపి, ఇటు వైసిపి నేతలు `కోడెల ఆత్మ’తో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్పా అసలేమీ జరిగిందో వెలికి తీసే ప్రయత్నం చేయడం లేదు. అటువంటి ధైర్యం కూడా వారెవ్వరిలో కనిపించడం లేదు.