Homeఆంధ్రప్రదేశ్‌ఏలూరు నగరంపై కాలుష్యం పడగ.. పట్టించుకోకపోతే పెనుముప్పు..?

ఏలూరు నగరంపై కాలుష్యం పడగ.. పట్టించుకోకపోతే పెనుముప్పు..?

Eluru Issue

ఉన్నట్టుండి ఒకేసారి కిందపడం.. కొందరకి మూర్చ రావడం.. మరి కొందరికి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మొత్తంగా 600 మంది ఆసుపత్రి పాలయిన ఘటన ఏలూరులో జరిగింది. వింత వ్యాధి అనుకొని ఆసుపత్రుల వైపు పరుగులు తీసిన జనానికి ఏం జరుగుతుంతో తెలియని పరిస్థితి. ఏదీ ఏమైనా ముగ్గురి ప్రాణాలు మాత్రం పోయాయి. మరికొందరు డిశ్చార్జి అయ్యారు. మరో  30 మంది వరకు చికిత్స పొందతున్నారు. ఆసుపత్రిలో చేరిన వారు డిశ్చార్జి అయిపోవడంతో సమస్య తీరిపోయిందనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఏలూరులో ఉన పరిస్థితులను పరిశీలిస్తే మరోసారి ఇలాంటి ఘటన పునరావ్రుతం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడున్న నీటి సమస్యను పరిష్కరించకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.  తాజా ఘటనపై  కలుషిత నీరే  కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఏలూరులో నీరు కలుషితంగా మారడానికి కారణమేంటో ఒకసారి చూద్దాం..

Also Read: జగన్ ఆ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాడా..?

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నగరాన్ని ఆనుకొని ప్రవహించి తమ్మిలేరు ఒకప్పుడు పరిశుభ్రంగా ఉండేది. కానీ ఇప్పుడు అది మురుగునీటితో నిండిపోతుంది. మురుగునీటిని తరలించడానికి దీనిని వాడడంతో ఈ సరస్సు కలుషితంగా మారింది. అయితే మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తున్నా అది సక్రమంగా జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఏలూరులో కలుషిత నీరు ప్రవహిస్తోందని 30 ఏళ్ల కిందటి నుంచే ఆందోళనలు ఉన్నాయి. విజయవాడ నుంచి విడుదలయ్యే మురుగునీరు క్రుష్ణ కాలువలో కలుస్తుంది. ఈ నీరు ఏలూరుకు వెళ్తుండడంతో నగరం చుట్టూ కాలుష్యం నీరు చేరిపోతుంది.

ఏలూరుకు వెళ్లే కాలువలో మురుగునీరు కలుస్తుందని దానిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని 1980లో విజయవాడ నగరపాలక సంస్థ నిర్ణయించింది. అందుకోసం కోటి రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించింది. అయితే ఆ హామీ కార్యరూపం దాల్చలేదని ఏలూరువాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఏలూరులోని కొందరు మాట్లాడుతూ విజయవాడ నుంచి మొదట క్రుష్ణ జలాలు వచ్చేవని, ఇప్పుడు మురుగునీరు వస్తుందని ఆవేదన చెందుతున్నారు. క్రుష్ణ కాలువ మాదిరిగానే గోదావరి నుంచి వచ్చే నీరు కూడా ఏలూరుకు కలువడంతో నగరం కలుషిత నీటి ఊబిలో చిక్కకున్నట్లయింది.

మరోవైపు కొల్లేరు సరస్సు ఆక్వా చెరువులుగా మారిపోయాయి. ఫలితంగా కాలుష్యంగా తయారయ్యాయి. విజయవాడ నుంచి వచ్చే మురుగునీటితో పాటు గుడివాడ పట్టణం, చక్కెర కర్మగారాలు, పాల ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు ఇందులో కలవడంతో కొల్లేరు కాలుష్యంగా మారింది. అయితే ఆక్వా చెరువుల నుంచి ఆదాయం వస్తుందని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఏలూరులో అండర్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడానికి అనుకూలమైన భూభాగం లేదు. దీంతో వర్షాలు వచ్చినప్పడు మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది.

Also Read: ఉత్తరాంధ్ర వేదికగా నూతన శకానికి ‘బిజ్ కాన్’ నాంది

ఇదిలా ఉండగా కాలుష్య నీరు ప్రవహించిన పంటలు పండడం, ఈ నీటితో పెరిగిన గ్రాసం పశువులు తినడం వల్ల ఇటు ప్రజలు, అటు పశువులు వింత వ్యాధి బారిన పడుతున్నాయి. ఇలా మురుగునీరు ప్రవహించడం వల్ల వ్యాధులు వస్తున్నాయని ఏలూరులో మాత్రమే బయటపడింది. రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా ద్రుష్టి సారించకపోతే పెను ప్రమాదమే జరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏలూరులో జరిగిన ఘటనకు కారణం తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్యలు తీవ్రంగా క్రుషి చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రాథమిక నివేదికల ఆధారంగా కచ్చితమైన నిర్ధారణలు జరగలేదని, సీసం, నికెల్ వంటి అనుమానాలున్నాయని అన్నారు. అయితే ఫెస్టిసైడ్స్ కూడా పరిశీలించాలని తెలిపారు. అయితే ఏలూరులో కాలుష్య సమస్య మొత్తంగా లేదని, కొన్ని డివిజన్లలో మాత్రమే ఉందని, ఆ డివిజన్లలో ఇప్పటికే కాలుష్య నీటిని శుద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

అయితే ఈ ఘటనలో అస్వస్థతకు గురైన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా మ్రుతుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సమస్యపై తక్కువ అంచనా వేసే అవకాశం లేదని కాలుష్య నివారణ అధికారులు అంటున్నారు. మరోచోట పెను ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకుంటే ప్రజల ప్రాణాలు కాపాడగలుగుతామని అంటున్నారు. ముఖ్యంగా కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటులో నీటి శుద్ధిపై సీరియస్ గా ఉండాలని సూచిస్తున్నారు. అస్వస్థత ఘటనకు మొత్తంగా తాగునీరు కలుషితం కావడమే ప్రధాన కారణమని ఓవరాల్ గా అనిపిస్తున్నా వాటిపై ప్రభుత్వం ద్రుష్టిపెట్టాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular