Konda Murali vs Errabelli: వరంగల్ లో కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకర్ రావుకు పడలేదన్నది అందరికి తెలిసిందే. ఇద్దరు పరస్పరం కత్తులు దూసుకోవడం పరిపాటే. రాజకీయాల్లో వీరిది అంతకంతకూ పెరుగుతున్న శతృత్వమని నగర వాసులకు విధితమే. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా ఎక్కువే. ఎర్రబెల్లి గురించి సురేఖ తనదైన శైలిలో విమర్శలు చేయడం గమనార్హం. ఆయన కూడా సురేఖ రాజకీయంపై ప్రతి విమర్శలు చేస్తూనే ఉంటారు. దీంతో వీరి మధ్య రాజకీయం ఓ ప్రహసనంలా మారింది.

తన భర్త కొండా మురళిని చంపడానికి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయత్నిస్తున్నారని సురేఖ ఆరోపించి సంచలనం సృష్టించారు. ఎర్రబెల్లి కుట్రలతోనే తాము సరిగా మనలేకపోతున్నామని చెబుతున్నారు. ఎర్రబెల్లి పార్టీలు మారుస్తూ తనలోని ఊసరవెళ్లి లా తయారయ్యారని గుర్తు చేస్తున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరి తన రాజకీయ పరపతి పెంచుకోవాలని ఉబలాటపడుతున్నారని మండిపడుతున్నారు.
ఎర్రబెల్లి పార్టీలు మార్చడంపై సురేఖ స్పందించారు. టీడీపీలో చేరినప్పుడే పార్టీ మారనని శపథం చేసిన ఎర్రబెల్లి ఎందుకు పార్టీ మారారని ప్రశ్నించారు. టీడీపీని విడిచిపెట్టిన ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ఒక తండ్రికే పెట్టానని పార్టీ మారనని చెప్పిన ఆయన పార్టీ మారటంపై తనదైన స్టైల్ లో బదులిచ్చారు.
టీఆర్ఎస్ లో చేరిన ఆయన ఎంత మంది తండ్రులకు పుట్టారో తెలియడం లేదని విమర్శించారు. టీడీపీలో చేరాలని ఆనాడే చంద్రబాబు తనను ఆహ్వానించినా అందులో ఎర్రబెల్లి ఉన్నారనే ఉద్దేశంతో తాను పార్టీ మారలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ప్రస్థానంపై విమర్శలు చేస్తున్నారు. ఆయన పాత్రపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.