Pragathi: ‘ప్రగతి..’ తెలుగు సినిమాల ప్రస్తుత మదర్ క్యారెక్టర్ లకు కేరాఫ్ అడ్రస్. ‘ఏమైంది ఈవేళ’ సినిమాలో హీరో తల్లి పాత్రకు నంది అవార్డు కూడా అందుకుంది. ఇక అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం పది పదిహేను సినిమాల్లో నటిస్తూ వచ్చింది. వదినగా, అక్కగా తల్లిగా ఆమె తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఏది ఏమైనా ఏ పాత్రలోనైనా అద్భుతంగా అభినయించి ప్రేక్షకులను మెప్పించడం ప్రగతికి ఉన్న ప్రత్యేకత.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి ఒకరు. నిజానికి ప్రగతి గతంలో బోల్డ్ రోల్స్ లో నటించినప్పటికీ.. ఈ మధ్య కాలంలో ఆమె అలాంటి పాత్రల్లో కనిపించలేదు. అయినా తన వయసు ఉండే హీరోలకు అమ్మగా నటించి మెప్పించడం అంటే…మాటలు కాదు. ప్రగతి ఆ పాత్రల్లో జీవించడమే కాకుండా.. మెప్పిస్తుంది కూడా.
అయితే, సినిమాల్లో ప్రగతి తల్లి పాత్రలు పోషించినప్పటికీ.. రియల్ లైఫ్ లో మాత్రం ఆమె వెరీ బోల్డ్. పైగా డేర్ అండ్ డాషింగ్ మహిళ. ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ ఎన్నికల ఫలితాల పంచాయతీలో ఆమె పేరు బాగా వినిపిస్తోంది. మంచు విష్ణు ప్యానెల్ కి సంబంధించిన ఓ వ్యక్తితో ఆమె ఎన్నికల సమయంలో గొడవకు దిగింది.
పైగా మంచు విష్ణు పై ఆమె గట్టిగానే వాదనకు దిగింది. అయితే, ప్రగతి పై తాజాగా ఒక న్యూస్ వినిపిస్తోంది. ఆత్మ అనే పేరుతో ప్రకాష్ రాజ్ మరో సెపరేట్ కుంపటిని పెట్టాలి అంటూ ఆమె తమ ప్యానెల్ సభ్యులను డిమాండ్ చేస్తోందట. అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చేసుకునే ప్రగతికి రాజకీయాలు అవసరమా ? అంటూ ఆమె పై కొంతమంది సీరియస్ అయ్యారు.
అన్నట్టు గ్లామరస్ గా కనిపిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకట్టుకోవడానికి ప్రగతి ఎప్పటికప్పుడు నెట్టింట యుద్ధం చేస్తూ ఉంటుంది. ఈ మధ్య బయట ఎక్కడా కనిపించినా ప్రగతి భుజంపైన పచ్చబొట్టు.. స్లీవ్ లెస్ బ్లౌజ్- చీర ధరించి బోల్డ్ గా కనిపించడానికి తెగ తాపత్రయ పడుతుంది.