ఏపీలో సంపూర్ణ లాక్ డౌనే శరణ్యమా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వేగంగా కేసులు పెరుగుతున్న రాష్ర్టంగా ఏపీ రికార్డులకెక్కుతోంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు. ఏ రాష్ర్టంలోనైనా 10 శాతం కేసులు నమోదైతే లాక్ డౌన్ విధిస్తారు. కానీ ఏపీలో పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి మించిందని తెలుస్తోంది. అనధికార లెక్కల ప్రకారం ఈ రేటు 30 శాతం ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. రోజురోజుకు […]

Written By: NARESH, Updated On : May 16, 2021 6:09 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వేగంగా కేసులు పెరుగుతున్న రాష్ర్టంగా ఏపీ రికార్డులకెక్కుతోంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు. ఏ రాష్ర్టంలోనైనా 10 శాతం కేసులు నమోదైతే లాక్ డౌన్ విధిస్తారు. కానీ ఏపీలో పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి మించిందని తెలుస్తోంది. అనధికార లెక్కల ప్రకారం ఈ రేటు 30 శాతం ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ఏపీ గజగజ వణుకుతోంది. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దీంతో భయాందోళన ఎక్కువైంది.

11 జిల్లాల్లో..
ఏపీలో 11 జిల్లాల్లో పరిస్థితి ఆందోళన కరంగా ఉందని చెబుతున్నారు విశాఖ, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని పేర్కొంటున్నారు. దీంతో కేసుల సంఖ్య నానాటికీ పెరగడంతో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఇలాంటి పరిస్థితిలో సంపూర్ణ లాక్ డౌనే శరణ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో సంపూర్ణ లాక్ డౌన్ దిశగా అడుగులు వేయాలని చూస్తున్నారు.

ఆందోళనకరంగా ఆరోగ్య శాఖ రిపోర్ట్
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అందిస్తున్న రిపోర్ట్ ఆందోళనకరంగా ఉంది. దేశంలో వేగంగా కేసులు నమోదవుతున్న రెండో రాష్ర్టంగా ఏపీ రికార్డులకెక్కుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇలాగైతే ఎలా అని దిగులు చెందుతున్నారు. రక్షణ చర్యలు చేపట్టడంలో తాత్సారం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వ పనితీరే ప్రామాణికంగా చెబుతున్నాయి.

కర్ఫ్యూ కొనసాగుతున్నా..
రాష్ర్టంలో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అనుమతి ఇస్తూ మిగతా సమయంలో కర్ఫ్యూ విధిస్తున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. దీంతో సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో సంపూర్ణ లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని చెబుతన్నారు. దీంతోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. సంపూర్ణ లాక్ డౌన్ తో కరోనా విస్తరణ తగ్గే వీలుంటుందని పలువురు పేర్కొంటున్నారు.