ఎక్స్ క్లూజివ్: అన్ని ఆలోచించే బాలయ్యతో ఒప్పుకుంది !

బాల‌కృష్ణ సినిమాలో యాక్షన్ ఎంత సర్వసాధారణమో.. హీరోయిన్ సమస్య అనేది కూడా అంతే సహజమైన విషయం అయిపోయింది. పాపం, బాలయ్య సినిమా కోసం డైరెక్టర్లు ఎప్పుడూ అర‌డ‌జ‌ను మంది స్టార్ హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతారు. అదేంటో చివరికీ వాళ్లల్లో ఒక్క హీరోయిన్ కూడా బాలయ్య సరసన నటించడానికి ఒప్పుకోదు, ఒప్పుకున్నా ఏవరేజ్ హీరోయిన్ కూడా భారీగా రెమ్యూనరేషన్ అడుగుతుంది. దాంతో ఆ హీరోయిన్ ను నిర్మాత ఒప్పుకోడు. చివరకు బాలయ్య చిన్నాచితకా హీరోయిన్లే దిక్కు అవుతున్నారు. అందుకే, […]

Written By: admin, Updated On : May 17, 2021 10:11 am
Follow us on

బాల‌కృష్ణ సినిమాలో యాక్షన్ ఎంత సర్వసాధారణమో.. హీరోయిన్ సమస్య అనేది కూడా అంతే సహజమైన విషయం అయిపోయింది. పాపం, బాలయ్య సినిమా కోసం డైరెక్టర్లు ఎప్పుడూ అర‌డ‌జ‌ను మంది స్టార్ హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతారు. అదేంటో చివరికీ వాళ్లల్లో ఒక్క హీరోయిన్ కూడా బాలయ్య సరసన నటించడానికి ఒప్పుకోదు, ఒప్పుకున్నా ఏవరేజ్ హీరోయిన్ కూడా భారీగా రెమ్యూనరేషన్ అడుగుతుంది. దాంతో ఆ హీరోయిన్ ను నిర్మాత ఒప్పుకోడు.

చివరకు బాలయ్య చిన్నాచితకా హీరోయిన్లే దిక్కు అవుతున్నారు. అందుకే, ఈ సారి బాలయ్య కాస్త తెలివిగా ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమా తరువాత, గోపీచంద్ మలినేనితో ఒక సినిమా ఫిక్స్ అయ్యాడు. మంచి హీరోయిన్ ను బుక్ చేయండి అని బాలయ్య, ఇప్పటికే డైరెక్టర్ తో చెప్పినట్టు తెలుస్తోంది. నిజానికి తన పక్కన ఏ హీరోయిన్ నటిస్తోంది అని బాలయ్య పెద్దగా పట్టించుకోడు,

అయితే, తన మిత్రులలో ఒకతను ‘మీ పక్కన ఏ స్టార్ హీరోయిన్ యాక్ట్ చేయదా ?’ అంటూ ప్రశ్నించాడట. దాంతో బాలయ్యకి ఇగో హర్ట్ అయింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తన తరువాత సినిమాలో స్టార్ హీరోయినే ఉండాలని పట్టుబట్టాడు. అందుకే శృతి హాసన్ ను బాలకృష్ణ సరసన నటించేలా చేయడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని తన తెలివిని ఉపయోగించి, శృతి హాసన్ ను ఒప్పించాడని తెలుస్తోంది. గోపీచంద్ ‘క్రాక్’ సినిమాతో శృతి హాసన్ కి మంచి హిట్ ఇచ్చాడు.

దాంతో, శృతి హాసన్ కి, గోపీచంద్ మలినేని కోసం సమైనా బాలకృష్ణ సరసన నటించక తప్పడం లేదట. బాలయ్య పక్కన హీరోయిన్ గా చేయడం ఇష్టం లేకపోయినా… మొత్తానికి శృతి హాసన్, డైరెక్టర్ కోసం ఒప్పుకుంది. అయితే, బాలయ్య సరసన శృతి హాసన్ నటించాక ఆమెకు ఇక ‘సీనియర్ హీరోయిన్’ అనే ముద్ర పడటం ఖాయం.

ఆ తర్వాత ఇక ఏ యంగ్ హీరో సరసన ఆమెకు అవకాశాలు రావు. అయినా 35 ఏళ్ల శృతి హాసన్ కి ఏ యంగ్ హీరో మాత్రం ఛాన్స్ ఇస్తాడు లేండి. అన్ని ఆలోచించుకునే శృతి హాసన్ బాలయ్య సినిమా ఒప్పుకొని ఉంటుంది.