జానారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ది మోస్ట్ సీనియర్ లీడర్. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నాగార్జనసాగర్. ఈ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో మరికొద్ది రోజుల్లో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కానుంది. సిట్టింగ్ సీటు కాకపోయినా గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్‌కు ప్రాధాన్య సీటే అనిచెప్పాలి.
Also Read: కేసీఆర్ కు డబ్బులు ఇచ్చాను.. బాంబు పేల్చిన విజయశాంతి
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇక్కడ గెలవడం అత్యవసరం. ఇక్కడ గెలిస్తే కొంత కాంగ్రెస్ కు తిరిగి ప్రాణం పోసినట్లవుతుంది. అందుకే నాగార్జునసాగర్ ఎన్నికపై కాంగ్రెస్ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. అందరూ సమన్వయంతో పనిచేసి ఈ స్థానాన్ని గెలుచుకోవాలని తపిస్తున్నారు. బీజేపీ బలాన్ని తగ్గించాలన్నా, తమ పరువును కాపాడుకోవాలన్నా నాగార్జునసాగర్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంటున్నారు. ఈ మేరకు పార్టీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా నేతలకు దిశా నిర్దేశం చేశారు.
అయితే.. జానారెడ్డి పార్టీలో కొనసాగుతారా లేరా అంటూ ఇన్నాళ్లు కాంగ్రెస్‌లో ఉన్న అనుమానాలు కూడా దీంతో పటాపంచలయ్యాయి. తాను కాంగ్రెస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదని జానారెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో జానా రెడ్డి కాని, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డిని కాని బరిలోకి దింపాలన్న యోచనలో ఉన్నారు. మరో మూడేళ్లు మాత్రమే పదవీ కాలం ఉండటంతో జానారెడ్డి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.
Also Read: బీజేపీ వ్యతిరేక సమావేశాన్ని కేసీఆర్ ఎందుకు విరమించుకున్నారు?
ఇప్పటికే వరుస ఓటములతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా నాగార్జునసాగర్ సీటును కైవసం చేసుకోవాలనే టార్గెట్ ఉంది. అక్కడ గెలిచి మరోసారి కాంగ్రెస్‌కు ఊపిరిపోయాలని నేతల ఆరాటం. కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఎన్నికపై అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. గత ఎన్నికలోనే జానారెడ్డి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఈసారి గెలుపు గ్యారంటీ అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ నేతలు గెలిచినా టీఆర్ఎస్‌లోకి వెళుతుండటమే ఇందుకు కారణం. కానీ జానారెడ్డి కుటుంబం కాంగ్రెస్ కు నమ్మకంగా ఉండటంతో ఈ సారి గెలుపునకు ఢోకాలేదంటున్నారు సీనియర్ నేతలు. మరి భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతోంది.. ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చూడాల్సిందే.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్