
వరుసగా 20 ఏళ్ల పవర్.. అటు సీఎంగా.. ఇటు పీఎంగా సక్సెస్ అయిన మోడీకి ఇప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కరోనా విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆర్థిక రంగం కూడా కుంగిపోవడంతో ఆయన ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. వీటికితోడు తాజాగా హత్రాస్ ఎపిసోడ్‌లోనూ మౌనంగా ఉండడంపైనా అసంతృప్తి వెల్లడవుతోంది. దీంతో సర్కార్ వెంట ఉన్న ఒక్కో మిత్రులు వెళ్లిపోతున్న పరిస్థితి వచ్చింది. ఇంతకాలం సరైన సమయం కోసం ఎదురుచేసిన కాంగ్రెస్ ఇప్పుడు అలెర్టు అయ్యింది.
Also Read: చక్రవడ్డీ మినహాయింపు తప్ప మేమేమీ చేయలేమంటున్న కేంద్రం
మోడీ సర్కార్‌పై ఇప్పుడిప్పుడు విమర్శలు పెరుగుతుండడంతో వాటిని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. దీంతో రాజకీయ దాడికి దిగేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు తగ్గట్లే ఒకట్రెండు అస్త్రాలతో కాకుండా ఏకంగా పది అస్త్రాలతో బరిలోకి దిగటం ఆసక్తికరంగా మారింది. మోడీ వైఫల్యాలతో దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని.. వాటిని పరిష్కరించటం బీజేపీ వల్ల కాదు సుమా అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది.
ఎన్డీయే పాలనను ప్రశ్నించే పది అస్త్రాల్ని తన అమ్ములపొదిలో చేర్చుకున్న కాంగ్రెస్.. వాటితో మోడీ సర్కారుపై పోరు సాగించనుంది.ఇంతకూ ఆ పది అస్త్రాలు ఏమిటన్నది చూస్తే.. కరోనా వ్యాప్తి సందర్భంగా ఎలాంటి ప్రణాళిక లేకుండా హడావుడిగా లాక్‌డౌన్‌ను తెర మీదకు తీసుకురావటం. వైరస్ గొలుసును తెగగొట్టటానికి 21 రోజుల పాటు లాక్‌డౌన్ పాటించటం ఒక్కటే మార్గమంటూ మోడీ చేసిన ప్రకటన. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. పెద్ద వయస్కుల్ని.. పిల్లల్ని వెంట పెట్టుకొని వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామాలకు నడక దారిని వెళ్లాల్సిన మహా సంక్షోభానికి కారణమయ్యారు.
Also Read: హరీష్ మార్క్ పాలి‘ట్రిక్స్’: దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుస్తుందా?
కరోనా వేళ విధించిన లాక్‌డౌన్ కాలంలో భారీ ఎత్తున కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. తూర్పు లద్దాఖ్ వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాట్లకు సంబంధించిన వాస్తవాల్ని మోడీ సర్కారు దాచేస్తోంది. చైనా సైన్యం పలు చోట్ల దేశంలోకి చొచ్చుకొచ్చినట్లుగా కేంద్ర రక్షణ మంత్రి ప్రకటన చేసి.. రెండు రోజులకే అలాంటిదేమీ లేదని బుకాయించటం. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వేళ.. వివిధ రంగాల్ని ఆదుకోవటానికి కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ కారణంగా పేదలకు ఒక్కరూపాయి కూడా ప్రయోజనం కలగకపోవటం. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల్ని దెబ్బతీసేలా ఉన్నాయి. హాత్రాస్ ఉదంతంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రంగా సాగింది. బాధితురాలి అంత్యక్రియల వేళ వారి కుటుంబ సభ్యుల్ని ఇంట్లో నిర్బంధించి గుట్టుగా అర్ధరాత్రి వేళ నిర్వహించటం. లాక్‌డౌన్ వేళ వలస కూలీలకు సంబంధించిన గణాంకాలు కేంద్రం వద్ద లేకపోవటం. నడకతో స్వస్థలాలకు వెళ్లే క్రమంలో ఎంతమంది మరణించారంటే.. అలాంటి రికార్డులు లేవని చెప్పటం. ఉద్యోగాల కల్పనలో వైఫల్యం. కోవిడ్ 19కు సంబంధించిన పలు వాస్తవాల్ని వెల్లడించకుండా దాచి పెట్టడాన్ని కాంగ్రెస్ అస్త్రంగా ఎంచుకుంది.
Comments are closed.