ఐపీఎల్‌లో ఢిల్లీ జోరు.. టాప్‌ ప్లేస్‌ సాధించిన జట్టు

ఐపీఎల్‌లో ఢిల్లీ జోరు కొనసాగుతోంది. తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. షార్జా వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయంతో హ్యాట్రిక్‌ సొంతం చేసుకుంది. 46 పరుగుల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ సాధించింది. బ్యాటింగ్‌లో హెట్‌ మెయిర్ మెరుపులు మెరిపించగా.. స్టోయినిస్ బ్యాటింగ్ -బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. Also Read: ఐపీఎల్ లో ఆ జట్టు కథ ముగిసినట్టేనా? టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి […]

Written By: NARESH, Updated On : October 10, 2020 4:31 pm
Follow us on

ఐపీఎల్‌లో ఢిల్లీ జోరు కొనసాగుతోంది. తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. షార్జా వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయంతో హ్యాట్రిక్‌ సొంతం చేసుకుంది. 46 పరుగుల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ సాధించింది. బ్యాటింగ్‌లో హెట్‌ మెయిర్ మెరుపులు మెరిపించగా.. స్టోయినిస్ బ్యాటింగ్ -బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు.

Also Read: ఐపీఎల్ లో ఆ జట్టు కథ ముగిసినట్టేనా?

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. హెట్మెయిర్ (45; 24 బంతుల్లో 1 ఫోర్ 5 సిక్స్‌లు) మార్కోస్ స్టోయినిస్(39; 30 బంతుల్లో 4 సిక్స్‌లు) శ్రేయస్ అయ్యర్(22;18 బంతుల్లో 4 సిక్స్‌)లతో మెరుపులు మెరిపించారు. ధావన్ (5)  పృథ్వీషా(19)  శ్రేయస్ అయ్యర్(22; 18 బంతుల్లో 4 ఫోర్లు) రిషభ్ పంత్(5) విఫలమయ్యారు.చివర్లో హర్షల్ పటేల్(16 నాటౌట్) అక్షర్ పటేల్(17) వేగంగా ఆడారు. రాజస్థాన్ బౌలర్ల లో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీశాడు.

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్  యశస్వి జైస్వాల్(34; 36 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్స్‌లు) తెవాటియా(38; 29 బంతుల్లో 3 ఫోర్లు 2సిక్స్‌లు) మాత్రమే రాణించారు. స్టార్ బ్యాట్స్ మెన్లు  సంజూ శాంసన్ (5)  స్టీవ్ స్మిత్(24; 17 బంతుల్లో 2 ఫోర్లు 1సిక్స్) జోస్ బట్లర్(13; 8 బంతుల్లో 2 ఫోర్లు) చేతులెత్తేసారు. జట్టులో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో రాజస్థాన్ కోలుకోలేకపోయింది. ఆ జట్టు 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటై పరాజయం  పాలైంది.

Also Read: ధోనీ టీంకు ఏమైంది..?

50 పరుగులకే మూడు వికెట్లు పోయిన ఢిల్లీని హెట్మెయిర్-స్టోయినిస్ల జోడి ఆదుకుంది. స్టోయినిస్ నాలుగు సిక్సర్లతో అలరించాడు. విరుచుకుపడితే ఆపై హెట్మెయిర్ వరుసబెట్టి బౌండరీలు బాదాడు. శ్రేయాస్ కూడా క్రిజ్‌లో ఉన్నది కాసేపే అయినా నాలుగు ఫోర్లు  బాదాడు. ఢిల్లీ బౌలర్లు రాజస్థాన్ బ్యాట్స్ మెన్లను కుదురుకోకుండా వరుసగా వికెట్లు తీశారు. దీంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో రబడా మూడు వికెట్లు సాధించగా స్టోయినిస్ అశ్విన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. హర్షల్ నోర్తేజ అక్షర్ పటేల్‌కు ఒక్కో వికెట్ లభించింది. పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.