https://oktelugu.com/

కేసీఆర్ కు జగ్గారెడ్డి లేఖాస్త్రం..

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై లేఖాస్త్రాన్ని సంధించారు. ప్రజలకు సంబంధించిన పలు డిమాండ్లను ఆ లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ తన డిమాండ్లను నెరవేర్చకుంటే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. లాక్డౌన్ కారణంగా కొన్ని పరిశ్రమలు మూసేయడం వల్ల కార్మికులు, యాజమాన్యాలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.   ప్రభుత్వం వీరందరికీ అండగా ఉండాలని కోరారు. తన డిమాండ్లపై ప్రభుత్వం […]

Written By: , Updated On : June 3, 2020 / 05:36 PM IST
Follow us on

Jagga-Reddy-Letter-to-KCR

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై లేఖాస్త్రాన్ని సంధించారు. ప్రజలకు సంబంధించిన పలు డిమాండ్లను ఆ లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ తన డిమాండ్లను నెరవేర్చకుంటే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. లాక్డౌన్ కారణంగా కొన్ని పరిశ్రమలు మూసేయడం వల్ల కార్మికులు, యాజమాన్యాలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

 

ప్రభుత్వం వీరందరికీ అండగా ఉండాలని కోరారు. తన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 9న తన ఇంట్లో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ బీజేపీతో అంటకాగుతుందంటూ విమర్శించారు. ఇదిలా ఉంటే లేఖలో ప్రజలకు సంబంధించిన పలు డిమాండ్ల చిట్టాను ఆయన విన్పించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్నును ఏడాదిపాటు రద్దు చేయాలని కోరారు. అలాగే ప్రజలు కరెంటు బిల్లులు కట్టకుండా ఆరునెలలపాటు నిలిపి వేయాలన్నారు. నీటి బిల్లులను కూడా ఏడాదిపాటు రద్దు చేయాలని కోరారు. పట్టణాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్నవారికి ఆరు నెలల వరకు కిరాయి ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. బ్యాంకు ఈఎంఐలను ఆరునెలలపాటు ప్రభుత్వమే చెల్లించాలన్నారు. పరిశ్రమలకు ఆరు నెలల వరకు కరెంట్ బిల్లులను రద్దు చేయాలనే డిమాండ్లను జగ్గారెడ్డి కేసీఆర్ కు సంధించిన లేఖలో పేర్కొన్నారు.