గుజరాత్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే ముఖ్యమంత్రిని మార్చి తన మార్కు చూపించుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో ముందుకు వెళుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ర్టం కావడంతో ఇక్కడ విజయమే ప్రధానంగా ముందుకు వెళ్లాలని మోడీ, షా ద్వయం ఆలోచిస్తోంది. పార్టీని మరోసారి అధికార పీఠంపై కూర్చోబెట్టాలని కసరత్తు ప్రారంభించారు. అందుకనుణంగా నేతలను సమాయత్తం చేస్తున్నారు. ఇరు పార్టీలు అస్ర్తశస్రాలు సిద్ధం చేస్తున్నాయి.
2017లో గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. అధికారం చేపట్టకపోయినా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. దీంతో అదే ఊపులో ఈసారి అధికారం హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. 182 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 99 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 66 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ఈసారి గుజరాత్ పై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గుజరాత్ పై ప్రత్యేక దృష్టి సారించారు. గుజరాత్ లో పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన వ్యూహాలు ఖరారు చేస్తున్నారు.
గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్న క్రమంలో నేతలు దూకుడు పెంచాలని చూస్తున్నారు. బీజేపీని దెబ్బకొట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేతల్లో జోష్ నింపే పనిలో పడ్డారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లో విజయం కోసం అన్ని దారులు వెతుకుతోంది.
ఇప్పటికే పలువురు నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని నిష్ణాతులైన వారిని తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. వారందరు వస్తే కాంగ్రెస్ కు విజయం దక్కినట్లే అని చెబుతున్నారు. కాంగ్రెస్ కు అనుకూల పవనాలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ లో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలు ఖరారు చేస్తోంది. బీజేపీని ఎదుర్కొనేందుకు పావులు కదుపుతోంది. ప్రధాని సొంత రాష్ర్టంలో పార్టీని అధికారంలో నిలిపి సవాలు విసరాలని భావిస్తోంది.