
షణ్ముఖ్ జశ్వంత్, సిరి హనుమంతు పరిచయం లేని పేర్లు. ఇద్దరు యూట్యూబ్ లో తమకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఇద్దరూ కలిసి వెబ్ సీరీస్, వీడియోస్ కుడా చేసారు. ఇంత క్రేజ్ సంపాదించిన ఈ జంట ఇప్పుడు బిగ్ బాస్ షో కి కలసికట్టుగా వచ్చారు.
ముందు నుండే పరిచయం ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రంబోల చేస్తున్నారు. పరిచయం ఉంది కాబట్టి పక్కా పెద్ద ప్రణాళికలతో, వ్యూహాలతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చిన రెండు రోజులకే గ్రూపులు కట్టేశారు. మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో హాట్ టాపిక్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు.
అసలు కంటెస్టెంట్స్ అందరి దృష్టిలో ఎందుకు ఇంత హాట్ టాపిక్ గా మారారు? దీనికి కారణం సిరి చెప్పిన పచ్చి అబద్ధం. ఇద్దరు కలసి ఎన్నో వీడియోస్ చేసారు. సిరి చెప్పిన ఆ అబద్ధం ఏంటంటే సిరి కి, షణ్ముఖ్ కి బయట పడేది కాదంట, సరిగ్గా మాట్లాడుకునేవాళ్ళు కాదంట, షన్ను సిరిని ఏడిపించేవాడంట. ఇదంతా నమ్మడానికి ప్రేక్షకులు చవట దద్దమ్మలు కాదుగా. బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఇద్దరూ చర్చించుకునే ఉంటారు. పెద్ద వ్యూహాలతోనే హౌస్ లో కి ఎంట్రీ ఇచ్చారు.
ఇదంతా పక్కన పెడితే షన్ను, సిరిలను మొదటి వారం, రెండవ వారం ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవి దుమ్మెత్తిపోశారు. దానికి కారణం షన్ను, సిరి లు కలిసి కట్టిన గ్రూపులు. సిరి నెమ్మది నెమ్మది గా తన ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని షన్ను అర్థం చేసుకున్నాడు. అందుకే ఈ మధ్య దూరం పెడుతున్నాడు.
తట్టుకోలేకపోతున్న సిరి….! షన్ను, సిరి లు మంచి ఫ్రెండ్స్. ఈ మధ్య సిరి ప్రభావం షన్ను మీద పడటం వల్ల నెగిటివిటి బాగా పెరిగిపోయింది. ఇదంతా అర్ధం చేసుకున్న షన్ను సిరి కి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు.
గురువారం జరిగినఎపిసోడ్ లో, నాకు ఇంట్రెస్ట్ లేదు పక్కకి వెళ్ళు అని ఒక్కసారిగ షన్ను అనేసరికి సిరి ఏడ్చుకుంటూ నాకు లోన్లీ ఫీలింగ్ గా ఉంది బిగ్ బాస్ అంటూ బోరున విలపించింది.