https://oktelugu.com/

వలస కూలీలకు కాంగ్రెస్ చేయూత!

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో. చిక్కుపోయిన వారిని వారి సొంత ప్రాంతాలకు పంపించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే వలస కార్మికుల రైలు చార్జీలను కాంగ్రెస్‌ చెల్లిస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. ఇది వలసకార్మికులకు కాంగ్రెస్‌ అందిస్తున్న సహకారమని, వారికి సంఘీభావంగా నిబడతామని ఆమె ఒక లేఖలో పేర్కొన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిపట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్న కేంద్రం వలసకార్మికుల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 4, 2020 / 10:19 AM IST
    Follow us on

    దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో. చిక్కుపోయిన వారిని వారి సొంత ప్రాంతాలకు పంపించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే వలస కార్మికుల రైలు చార్జీలను కాంగ్రెస్‌ చెల్లిస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. ఇది వలసకార్మికులకు కాంగ్రెస్‌ అందిస్తున్న సహకారమని, వారికి సంఘీభావంగా నిబడతామని ఆమె ఒక లేఖలో పేర్కొన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిపట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్న కేంద్రం వలసకార్మికుల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికుల ప్రయాణ చార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. ”వలసకార్మికులు దేశాభివృద్ధిలో భాగస్వాములని అన్నారు. విదేశాల్లో చిక్కుకున్న స్వదేశీయులకు ఉచిత విమాన ప్రయాణాన్ని అందించడం తమ భాద్యతగా గుర్తించిన ప్రభుత్వం, వారికి ఆహారం, రవాణా కోసం రూ. వందకోట్లు వెచ్చించిందని విమర్శించారు. గుజరాత్‌బిలో ఒక్క ప్రజా కార్యక్రమం కోసం రైల్వే శాఖ రూ. 151 కోట్లు విరాళంగా ప్రకటించినపుడు, వలసకార్మికులను ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో ఉచిత రైలు ప్రయాణం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.