Nambi Narayanan: భాతర అంతరిక్ష పరిశోధనం సంస్థ (ఇస్రో) ఇటీవల చంద్రయాన్ -3 ప్రయోగం చేయడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ప్రయోగంపై రకరకాల కథనాలు, కామెంట్లు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ఇస్రో ఘనతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇస్రోలో పనిచేసిన మాజీ శాస్త్రవేత్తలు సైతం ఇప్పటి ప్రయోగంపై మెచ్చుకుంటున్నారు. అయితే ఇస్రో లో ఒకప్పుడు చైర్మన్ గా ఉన్న నంబి నారాయణన్ కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్రోపై నమ్మకం కలిగించలేదని అన్నాడు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా ఆయన ఏమన్నాడంటే?
ఛారిత్రాత్మిక చంద్రయాన్ -3 ప్రయోగం ను ప్రధాని నరేంద్ర మోదీ క్రెడిట్ తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ తరుపున ప్రయోగించిన చంద్రయాన్ -3 క్రెడిట్ ప్రధానికికాక ఇంకెవరికి దక్కుతుందనిఅన్నారు. ఈ తరుణంలో ‘ది న్యూస్ ఇండియా’ తో ఆయన పాల్గొన్న ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను బీజేపీ కూడా షేర్ చేసింది.
ఈ వీడియో ఆయన ‘గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్రోకు తగినంత నిధులు కేటాయించలేదు. ఇస్రో తన విశ్వనీయతను నిరూపించుకున్న తరువాతేనిధులు ఇచ్చింది. మా దగ్గర కనీసం జీపు కూడా లేదు. కారు లేదు. అంటే అప్పట్లోనే నిధులు ఇవ్వలేదు. ఇది మొదట్లోనే జరిగింది. ’’ అని అన్నారు. ఇస్రో కు సంబంధమున్న వారికి జీతాలు, పింఛన్లు రావడం లేదన్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ ‘నాకు ప్రతి నెలా 29న పింఛన్ వస్తుంది. జీతాలు కూడా వస్తున్నాయి.’ అని నంబినారాయణన్ అన్నారు.
ఇదిలా ఉండగా చంద్రాయన్ -3 ప్రయోగంపై బీజేపీ, కాంగ్రెస్ వార్ కొనసాగుతోంది. బీజేపీ నాయకులు మాలవీయ ఎక్స్ లో నంబి నారాయణన్ ఇంటర్వ్యూ క్లిప్పులను తో పాటు ‘అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఇస్రోకు బడ్జెట్ పెంచి శాస్త్రవేత్తలకు అండగానిలుస్తున్నారన్నారు.వారి విజయాలు, వైఫల్యాలు ఎన్నైనా మోదీ ముందుకు నడిచారన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఇదే ఎక్స్ లో ‘ల్యాండింగ్ తరువాత మీరుతెరపైకి వచ్చి క్రెడిట్ తీసుకున్నారు. అంతకుముందు శాస్త్రవేత్తలకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు’అని రాసుకొచ్చారు.