Homeజాతీయ వార్తలుCongress: టీ కాంగ్రెస్‌కు అదే పెద్ద మైనస్‌.. ఆటాడుకుంటున్న బీఆర్‌ఎస్‌ !

Congress: టీ కాంగ్రెస్‌కు అదే పెద్ద మైనస్‌.. ఆటాడుకుంటున్న బీఆర్‌ఎస్‌ !

Congress: తెలంగాణలో దాదాపుగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియాను ఎదుర్కొనేందుకు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తంటాలు పడుతుంది. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఈ లోపాన్ని అసెంబ్లీ సమావేశాలు బయటపెట్టాయి. తమ పార్టీకి చెందిన లీడర్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇస్తే అది నిజమని నమ్మించేందుకు సోషల్‌ మీడియా చకచకా కొన్ని డాక్యుమెంట్లు చూపిస్తూ.. పోస్టులు పెట్టేస్తే.. వైరల్‌ చేస్తూ వచ్చింది బీఆర్‌ఎస్‌. అదే సమయంలో ప్రభుత్వం చెప్పే అంశాలు, నిజాలు, డాక్యుమెంట్లు ప్రజల్లోకి వెళ్లలేదు. దీనికి కారణం కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా బలహీనంగా ఉండటమే.

బలంగా మార్చిన కేటీఆర్‌..
సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ చాలాకాలంగా బలహీనంగానే ఉంది. జాతీయ స్థాయిలోనూ ఇదే పరిస్థితి. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ సోషల్‌ మీడియాలో తమ అభివృద్ధిని చూపుతుంటే కాంగ్రెస్‌ మాత్రం ఆ స్థాయిలో వైఫల్యాలను ఎత్తి చూపడం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అదే పరిస్థితి. బీఆర్‌ఎస్‌ ఓడిపోయినా సోషల్‌ మీడియాలో బలంగా ఉంది. కాంగ్రెస్‌ మాత్రం బలహీనంగా ఉంది. బీజేపీకి దీటుగా బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాను బలోపేతం చేశారు ఆపార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రాజకీయాల్లో సోషల్‌ మీడియా ప్రభావం ఎలా ఉంటుందో బాగా తెలుసు. అందుకే ఆయన మొదటి నుంచి బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాను ఊహించని విధంగా బలపరుస్తూ వచ్చారు. దానిపై చాలా పెట్టుబడి పెట్టారు. దేశ విదేశాల్లో సోషల్‌ మీడియా సైన్యన్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఓ అంశాన్ని ట్రెండ్‌ చేయాలనుకుంటే ఇట్టే చేస్తుంది. కేటీఆర్‌ ఐటీ మినిస్టర్‌ ఎపిసోడ్‌ దీనికి ఊదహరణ. అనుకుంటే తాము అనుకున్న టాపిక్‌ ను ఓ గంట అయినా ట్రెండింగ్‌ లో ఉంచగలరు.

విపక్షంలోనూ సహాయకారిగా..
అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థకృతంగా తమ సోషల్‌ మీడియా సైన్యాన్ని బలపర్చుకోవడం వల్ల.. ఇప్పుడు విపక్షంలోకి పోయినా పెద్దగా నష్టం జరగడం లేదు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ముందు తేలిపోతున్న కాంగ్రెస్‌ ఇప్పుడు పొలిటికల్‌ జనరేషన్‌ వేరుగా ఉంది. నేరుగా అసెంబ్లీ సమావేశాలు లైవ్‌ చూసి.. తమకు తాము ఏది మచో.. చెడో నిర్ణయించుకునే స్థితిలో మిలేనియల్స్‌ లేరు. పైగా వారికి చూసేంత తీరిక లేదు. నిజమో అబద్దమో..సోషల్‌ మీడియాలో వచ్చేదే నమ్ముతున్నారు. అందుకే రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియా సైన్యాలను పెంచుకుంటూ పోతున్నాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సోషల్‌ మీడియా వ్యవస్థ కనిపించడం లేదు. ఇదే అధికార పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది.

ఎన్నికల్లో టీడీపీ సోషల్‌ మీడియా సపోర్టు..
ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌పై కోపంతో కొంత మంది టీడీపీ సానుభూతిపరులు పని చేశారు. బీఆర్‌ఎస్‌తో వాదనలు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్‌ వైపు నుంచి సరైన సోషల్‌ మీడియా పోరాటమే కనిపించలేదు. ఆ లోపం అధికారంలోకి వచ్చిన తరవాత ఇంకా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ వాయిసే ఎక్కువగా వైరల్‌ అవుతోంది. కానీ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న విషయాలు మాత్రం వైరల్‌ కావడం లేదు.

బలోపేతం చేస్తేనే..
సోషల్‌ మీడియాను బలోపేతం చేసుకోవడం కాంగ్రెస్‌కు ముఖ్యం సోషల్‌ మీడియాలో ప్రచారాలకు నియంత్రణ లేదు. ఎక్కువ ఎవరు ఏది నమ్మితే అదే నిజం. అందుకే నిజాన్ని కూడా నమ్మించడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. ప్రజలే తెలుసుకుంటారు అని నింపాదిగా ఉంటే.. అబద్ధమే నిజమవుతుంది. సోషల్‌ మీడియా ప్రభావం రాజకీయాల్లో పెరిగిన తర్వాత ఎన్నో ఇలాంటివి జరిగాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా తన సోషల్‌ మీడియాను బలోపేతం చేసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular