https://oktelugu.com/

మరో ప్రాంతాన్ని చేజిక్కించుకుంటున్న బీజేపీ: పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ ప్రభుత్వం..

బీజేపీ వేసిన స్కెచ్ లో మరో చోట కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను తన వశం చేసుకున్న కాషాయ పార్టీ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిపై దృష్టి సారించింది. తాజాగా కాంగ్రెస్ నిరూపించాల్సిన బలపరీక్షలో సీఎం వి.నారాయణ తన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విఫలమయ్యారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఎక్కవే ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 26 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2021 / 11:36 AM IST
    Follow us on

    బీజేపీ వేసిన స్కెచ్ లో మరో చోట కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను తన వశం చేసుకున్న కాషాయ పార్టీ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిపై దృష్టి సారించింది. తాజాగా కాంగ్రెస్ నిరూపించాల్సిన బలపరీక్షలో సీఎం వి.నారాయణ తన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విఫలమయ్యారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఎక్కవే ఉన్నట్లు తెలుస్తోంది.

    కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 26 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో కాంగ్రెస్-డీఎంకేకు కలిసి 14 స్థానాలుండగా అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 13 సభ్యుల సంఖ్య అవసరం. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కూటమికి 12 మంది మాత్రమే సభ్యులున్నారు. దీంతో ప్రభుత్వ మైనార్టీలోపడింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి నారాయణ ఆదివారం రాత్రి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

    ఇక ఎన్ఆర్ కాంగ్రెస్, ఏఐడీఎంకేతో కలిపి బీజేపీకి 14 ఎమ్మెల్యే సంఖ్యా బలం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఇందులో కలుస్తారు. దీంతో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం లభించినట్లయింది. ఈ పరిణామాల దృష్ట్యా విశ్వాస పరీక్షకు ముందే ముఖ్యమంత్రి వి.నారాయణ రాజీనామా చేయొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి.

    గత కొన్ని రోజులుగా ఇక్కడ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం వి నారాయణల మధ్య అంతర్గత పోరు సాగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇక్కడ గవర్నర్ గా తమిళ సై సుందర్ రాజాను అపాయింట్మెంట్ చేసింది. అయితే విశ్వాస పరీక్షలో నెగ్గుతామని భావించిన నారాయణ స్వామికి తమ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాతో షాక్ తిన్నారు. దీంతో ఇక్కడి ప్రభుత్వం బీజేపీకి చేతిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.