https://oktelugu.com/

సునీతకు ఆఫర్లు మామూలుగా లేవుగా..

‘బిగ్ బాస్..’ పాపులారిటీకోసం ఈ షోలోకి వెళ్లాలనుకుంటారు కంటిస్టెంట్స్.. అప్పటికే పాపులారిటీ వచ్చిన వారిని తీసుకోవాలని చూస్తుంది హౌస్! ఇద్ద‌రి ల‌క్ష్యం ఒక‌టే పాపులారిటీని ద‌క్కంచుకోవాలి.. దాన్ని క్యాష్ గా మ‌లుచుకోవాలి. ఇదే సూత్రాన్ని అనుస‌రిస్తూ అటు నిర్వాహ‌కులు.. ఇటు కంటిస్టెంట్లు బిగ్ బాస్ షోను సూప‌ర్ హిట్ చేస్తూ వ‌స్తున్నారు. Also Read: ‘చెక్’ సినిమా టికెట్ బ్లాక్ లో కొన్నాను.. రిలీజ్ కోసం వెయిటింగ్ః రాజ‌మౌళి అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్లు ముగిశాయి. […]

Written By:
  • Rocky
  • , Updated On : February 22, 2021 / 11:40 AM IST
    Follow us on


    ‘బిగ్ బాస్..’ పాపులారిటీకోసం ఈ షోలోకి వెళ్లాలనుకుంటారు కంటిస్టెంట్స్.. అప్పటికే పాపులారిటీ వచ్చిన వారిని తీసుకోవాలని చూస్తుంది హౌస్! ఇద్ద‌రి ల‌క్ష్యం ఒక‌టే పాపులారిటీని ద‌క్కంచుకోవాలి.. దాన్ని క్యాష్ గా మ‌లుచుకోవాలి. ఇదే సూత్రాన్ని అనుస‌రిస్తూ అటు నిర్వాహ‌కులు.. ఇటు కంటిస్టెంట్లు బిగ్ బాస్ షోను సూప‌ర్ హిట్ చేస్తూ వ‌స్తున్నారు.

    Also Read: ‘చెక్’ సినిమా టికెట్ బ్లాక్ లో కొన్నాను.. రిలీజ్ కోసం వెయిటింగ్ః రాజ‌మౌళి

    అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్లు ముగిశాయి. అయితే.. నాలుగో సీజ‌న్ ముగిసి మూడు నెలలు కూడా కాకుండానే అప్పుడే సీజన్-5 గురించి హ‌డావిడి మొద‌లైంది. కరోనా కారణంగా గతేడాది సీజ‌న్ ఆలస్యంగా మొదలు కావ‌డంతో.. ఈ సారి క‌రెక్ట్ టైంకే స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారు నిర్వాహ‌కులు. ఈ లెక్క ప్ర‌కారం జూన్ నుంచి ప్లాన్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. దీంతో.. ఇప్పటికే కంటెస్టెంట్స్ కోసం వ‌ర్క‌వుట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే కొందర్ని ఫైనల్ చేస్తున్నారు కూడా..

    ఇప్ప‌టికే ఫైన‌ల్ అయిన పేరులో ముందు వ‌ర‌స‌లో ఉన్నారు ‘టిక్ టాక్ దుర్గారావు’. ఆయనను సీజన్-5 కంటెస్టెంట్‌గా ఫైనల్ చేశారు. దుర్గారావు కూడా ఇప్పటికే కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు. ఇక, యూట్యూబ్ స్టార్ గా ఉన్న షణ్ముఖ్ జస్వంత్‌కు భారీ ఆఫర్ ఇచ్చి ఫిక్స్ చేశారని తెలుస్తోంది. సీజన్-2లో ఈయన ప్రియురాలు దీప్తి సునయన పార్టిసిపేట్ చేసింది. సీజన్-5 కోసం షణ్ముఖ్ ను లైన్లో పెడుతున్నారు.

    Also Read: సినిమా సెట్ లో ఇలా మారిపోయిన పవన్ ను చూసి అంతా షాక్

    లేటెస్ట్ గా మరో సెలబ్రిటీ పేరు వినిపిస్తోంది. ఆమే.. సింగర్ సునీత. రెండో పెళ్లి తర్వాత ఈమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. అంతకు ముందు వరకూ కొందరికే తెలిసిన సునీత.. ఇప్పుడు అందరికీ పరిచయం అయిపోయారు. ఇప్పటికీ వార్తల్లో వ్యక్తిగానే ఉంటున్నారు. రామ్ వీరపనేనితో జనవరిలో పెళ్లి జరగ్గా.. అప్పట్నుంచి ఏదో ఒక విషయంలో చర్చల్లో కంటిన్యూ అవుతున్నారు.

    కాబట్టి.. ఈమెను సీజన్ – 5లోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారట నిర్వాహకులు. అంతేకాదు.. ఆమెను అప్రోచ్ అయ్యారని ప్రచారం సాగుతోంది. ఈ షో కోసం సునీతకు ఊహించని ఆఫర్ ఇచ్చారని స‌మాచారం. అయితే.. ఈ మధ్యనే వివాహం అయ్యింది కాబట్టి.. సునీత అంగీకరిస్తారా? లేదా? అన్న‌ది ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్