Congress friendship with BRS: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అన ్నది నానుడి. ఇది ఇప్పుడు తెలంగాణలో నిజం కాబోతోందా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ సీనియర్ నేతలు. 2009 ఎన్నికల నాటి మైత్రి మళ్లీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్ కూడా ప్రజా వ్యతిరేకత నేపథ్యలలో సింగిల్‌గా ఎన్నికలకు వెళ్తే నష్టం తప్పదన్న భావనలో ఉంది. ఈ క్రమంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉంది.

గులాబీతో సీనియర్ల టచ్?
కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జిగా మాణిక్యం ఠాగూర్ తప్పుకున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ బలహీనపడ్డారన్న భావన కాంగ్రెస్ సీనియర్లలో ఉంది. దీంతో మొదటి నుంచి బీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్న కాంగ్రెస్ నేతలు పొత్తు ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం కన్నా.. భారత రాష్ట్ర సమితితో కలిసి ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయాన్ని గతంలలో మాణిక్యం ఠాగూర్ వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే బీఆర్‌ఎస్‌తో వెళ్లడం అంటే.. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్నట్లేనని అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోవద్దని ఠాగూర్‌తో పాటు రేవంత్ రెడ్డి కూడా సీనియర్లకు తెగేసి చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్లు ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారని రేవంత్ వర్గం కాంగ్రెస్ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు చేసింది. తాజాగా మాణిక్యం తప్పుకోవడంతో మళ్లీ పొత్తు ప్రతిపాదన తెరపైకి తెస్తున్నట్లు సమాచారం.

పొత్తు కోసమే రచ్చ చేస్తున్నారా?
పొత్తుల వ్యవహారమే మాణిక్యం ఠాగూర్ తప్పకోవడానికి, కాంగ్రెస్‌లో సంక్షోబానికి కారణంగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిన కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలయింది. రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న సీనియర్ లీడర్లు బీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకోవాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు ఇచ్చేలా బీఆర్‌ఎస్ పార్టీతో ఒప్పందం చేసుకోవాలని సూచించారట. ఇరు పార్టీలు కలిసి బీజేపీతో పోరాడితే.. ఫలితం ఉంటుందని చెప్పారట. గులాబీ దళంతో పొత్తు ద్వారా.. పార్టీకి ఫండింగ్ కూడా వస్తుందని వివరించారట. ఐతే ఈ ప్రతిపాదనను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌తో పొత్త ప్రసక్తే లేదని స్పష్టం చేశారట.

Also Read: Telengana: తెలంగాణలో బీహారీలే పాలిస్తుంటే ఇక మేము ఎందుకు?
పొత్తుకు సై అంటున్న రేవంత్ వ్యతిరేక వర్గం..
మరోవైపు రేవంత్ వ్యతిరేకవర్గం మాత్రం బీఆర్‌ఎస్‌తో పొత్తే కాంగ్రెస్‌ను నిలబెడుతుందని భావిస్తోంది. ఇందుకోసం రేవంత్‌రెడ్డి వ్యతిరేకవర్గంలోని కొందరు ముఖ్యమైన నేతలు బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సీరియస్‌గా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇరు పార్టీలు కలిస్తేనే.. పార్టీకి లాభం ఉంటుందని భావిస్తున్నారట. మాణిక్యం తప్పుకున్న నేపథ్యంలో పొత్తు పొడుస్తుందో లేదో వేచిచూడాలి. పొత్తు కుదిరితే ఒంటరి పోరు విషయంలో రేవంత్ ఒంటరి అవడం ఖాయం.