బ్లాక్, జిల్లా, రాష్ర్ట స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ర్ట విభాగాలు జులై 7 నుంచి 17 మధ్య అమలు చేస్తామని చెప్పారు. బ్లాక్ స్థాయిలో మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఏఐసీసీ సంస్థలు ఆందోళనలో పాల్గొంటాయన్నారు. జిల్లా స్థాయిలో సైకిల్ ర్యాలీలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ర్ట స్థాయిలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తామని వివరించారు.
మే 2 నుంచి ప్రభుత్వం ఇంధన ధరలు 29 సార్లు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధర రూ.100 దాటి సామాన్యుడికి భారంగా మారిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏడు సంవత్సరాల్లో రూ.22 లక్షల కోట్లు ఆర్జించిందని దుయ్యబట్టారు. ధరల పెరుగుదల ఈ స్థాయిలో ఉంటే సామాన్యుడు ఎలా బతకాలని ప్రశ్నించారు. దీంతో బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆందోళనలు చేసేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.