హైదరాబాద్ లో ఆదివారం భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు గంటన్నర పాటు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఖైరతాబాద్-జంజారాహిల్స్ రహదారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. ఇంజిన్ లోకి నీరు చేరి రెండు కార్లు రహదారికి అడ్డంగా ఆగిపోవడంతో లక్డీకాపూర్ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నారాయణ గూడ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.