Homeజాతీయ వార్తలుమండుతున్న ధరలు..: మోడీపై ఫైర్‌‌ అవుతున్న నెటిజన్లు

మండుతున్న ధరలు..: మోడీపై ఫైర్‌‌ అవుతున్న నెటిజన్లు

PM Modi
మోడీ.. ఆయనో డైనమిక్‌ లీడర్‌‌. టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధాన వరకు ఎదిగారు. ఒక టీ అమ్ముకునే వ్యక్తి రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించగలడా అని అందరూ అనుకున్నారు. ఇంకా కొందరిలో ఆ డౌట్లు అలానే ఉన్నాయి కూడా. అయితే.. ఇప్పుడు మోడీపై పలువురు పెదవి విరుస్తున్నట్లుగా తెలుస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినప్పడు దేశం కూడా ఆ రాష్ట్రం మాదిరి అభివృద్ధి చెందుతుందని దేశ వ్యాప్తంగా ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. అయితే.. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి ప్రజా వ్యతరేక నిర్ణయాలనే తీసుకుంటున్నారు. ఆయన చేసే విదేశీ టూర్లు, వేసుకునే వస్త్ర ధారణ చూసి కార్పొరేట్లతో కలసి పోయారని చెప్పక తప్పదు.

Also Read: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు..: పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం

పెట్రోలు లీటరు వంద రూపాయలకు చేరుతున్నా మోడీ పట్టించుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యావసరాలు నింగినంటుతున్నా భారీ డైలాగులు చెప్పడం తప్పితే చేతలు మాత్రం శూన్యం. కనీసం కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు ఉపయోగపడే చర్యలు లేవు. అగ్రి సెస్స్ పేరుతో బాదుడుకే మోదీ పూనుకున్నారు. ఇక వంట గ్యాస్ ధరను కూడా పెంచేశారు. త్వరలో గ్యాస్ సిలిండర్ పై ఉన్న సబ్సిడీని కూడా ఎత్తివేస్తారని తెలుస్తోంది.

Also Read: మోదీ.. సర్కారువారి పాట ‘2024’

ఇక ప్రజలు సెంటిమెంట్‌గా భావించే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటు పరం చేయడానికి మోడీ సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసి ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి నరేంద్రమోడీ పూనుకున్నారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ వంటి సంస్థలను కూడా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధమయ్యారు. అదానీ, అంబానీల ప్రయోజనం కోసమే మోదీ ప్రజల ఆస్తులను పారిశ్రామికవేత్తలకు తాకట్టు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

ఇప్పటికే దేశంలో చాలా వరకు ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మోదీ పాలన కంటే మన్మోహన్ పాలన వెయ్యిరెట్లు మెరుగన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మోదీపై సాధారణ, మధ్యతరగతి ప్రజల్లో పూర్తిగా నమ్మకం సన్నగిల్లింది. మోదీ తన నిర్ణయాలతో పార్టీని పూర్తిగా పడకెక్కించేందుకే సిద్ధమయ్యారని టాక్‌ నడుస్తోంది. వాజ్ పేయి హయాంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో మోదీ తన పాలనలో దేశాన్ని పూర్తిగా పడుకోబెట్టేశారన్నది నిపుణుల అభిప్రాయం కూడా.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular