https://oktelugu.com/

కాంగ్రెస్ పనైపోయింది.. బీజేపీయే ప్రత్యామ్మాయం!

ఒక కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ అయ్యిండి సొంత పార్టీ పని అయిపోయిందని బహిరంగంగా ప్రకటించేశారు కొండా విశ్వశ్వరరెడ్డి.. ఈ చేవెళ్ల మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి. కాంగ్రెస్ ఉన్న ఆయన సొంత పార్టీపై చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. Also Read:  గ్రేటర్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్..! టీఆర్ఎస్ ను ఎదురించే సత్తా బీజేపీకే ఉందంటూ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2020 / 01:33 PM IST
    Follow us on

    ఒక కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ అయ్యిండి సొంత పార్టీ పని అయిపోయిందని బహిరంగంగా ప్రకటించేశారు కొండా విశ్వశ్వరరెడ్డి.. ఈ చేవెళ్ల మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి. కాంగ్రెస్ ఉన్న ఆయన సొంత పార్టీపై చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.

    Also Read:  గ్రేటర్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్..!

    టీఆర్ఎస్ ను ఎదురించే సత్తా బీజేపీకే ఉందంటూ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తే బీజేపీ సత్తా ఏంటో అర్థమవుతుందని కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు పూర్తిగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం పోస్టల్ బ్యాలెట్ ద్వారా స్పష్టమైందని .. టీఆర్ఎస్ ను ఎదురించే సత్తా బీజేపీ ఉందనే విషయం వారు ఖచ్చితంగా నమ్ముతున్నారని కొండా చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో సొంత పార్టీ పరిస్థితిపై ఆయన ట్విట్టర్ లో ఘాటుగా స్పందించాడు.

    కాంగ్రెస్ నేత అయిన కొండా విశ్వశ్వేరరెడ్డి తమ ప్రత్యర్థి పార్టీని ప్రశంసించడం చర్చనీయాంశమైంది. కొండా త్వరలోనే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొంది.

    Also Read: తొలి రౌండ్లో దూసుకెళుతున్న కారు.. యూసఫ్ గూడలో బోణికొట్టిన టీఆర్ఎస్..!

    జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తేలిపోతోంది. కేవలం రెండు మూడు సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందా అన్న ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ వాదుల్లోనూ నిరాశ ఎదురవుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్