Govt of India vs Telangana Govt: వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం రాష్ర్టం మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ధాన్యం కొనటం లేదని రాష్ర్టం రాష్ర్టమే ఇవ్వడం లేదని కేంద్రం ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధాన్యం పంచాయితీ ఇంకా తేలలేదు. కేంద్రమే ధాన్యం కొనుగోలుకు అడ్డు పడుతుందని రాష్ర్టం చెబుుతుంటే రాష్ర్టమే తన టార్గెట్ చేరుకోలేదని కేంద్రం బుకాయిస్తోంది. మరోవైపు రెండు ప్రభుత్వాల మధ్య రైతు మాత్రం నలిగిపోతున్నాడు. రెండు ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం ఓ తాజా ట్విస్ట్ ఇచ్చింది. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ప్రకటన చేసింది. దీంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. అసలు తెలంగాణ ధాన్యం సేకరణ టార్గెట్ చేరుకోలేదని చెబుతూనే తెలంగాణ ధాన్యం కొనుగోలులో టార్గెట్ దాటిందని చెప్పడంతో అందరిలో సంశయాలు వస్తున్నాయి. అసలు కేంద్రం ప్రకటనలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
Also Read: పంతం పట్టిన కేసీఆర్ కు ఈ ఏడాది ఏం గతి పట్టింది?
2020-21 ఖరీఫ్ లో దేశవ్యాప్తంగా 894 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని తెలిపింది. ఇందులో తెలంగాణ టార్గెట్ కంటే ఎక్కువ ధాన్యాన్నే కొనుగోలు చేసిందని చెప్పడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో ఏది నిజమో ఏది అబద్దమో అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. దీంతో కేంద్రం రాష్ర్టంపై ప్రశంసలు కురిపించడంలో ఉద్దేశమేమిటో అంతుచిక్కడం లేదు.
కేంద్రం, రాష్ర్టం ప్రజల్ని గందరగోళ పరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని తెలుస్తోంది. రైతుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తుంటే అన్నదాతలు ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదు. దీంతో పరిపాలన చేసే ప్రభుత్వాలే ఇలా తప్పుడు సంకేతాలు ఇస్తుంటే ఎవరిపై విశ్వాసం ఉంచుకోవాలో అర్థం కావడం లేదుని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పక్కదారి పట్టించే నిర్ణయాలు పున: సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: కేంద్రంపై జాతీయ ఉద్యమం.. టీఆర్ఎస్ మరో సంచలనానికి రెడీ అవుతోందా?