https://oktelugu.com/

Pan Card: వామ్మో.. పాన్ కార్డును కలిగి ఉండటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?

Pan Card:  దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు పాన్ కార్డును కలిగి ఉన్నారు. పాన్ కార్డు అనగా ఆదాయపు పన్ను శాఖ కేటాయించే పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నెంబర్. పాన్ కార్డు గుర్తింపు రుజువుగా కూడా పని చేస్తుందనే సంగతి తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, పరిమితికి మించి ఆస్తులు కొనుగోలు చేయడం, ప్రొఫెషనల్ ఫీజులకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పలు లావాదేవీలు చేయడానికి కూడా పాన్ కార్డ్ తప్పనిసరి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆధార్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2021 / 10:49 AM IST
    Follow us on

    Pan Card:  దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు పాన్ కార్డును కలిగి ఉన్నారు. పాన్ కార్డు అనగా ఆదాయపు పన్ను శాఖ కేటాయించే పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నెంబర్. పాన్ కార్డు గుర్తింపు రుజువుగా కూడా పని చేస్తుందనే సంగతి తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, పరిమితికి మించి ఆస్తులు కొనుగోలు చేయడం, ప్రొఫెషనల్ ఫీజులకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పలు లావాదేవీలు చేయడానికి కూడా పాన్ కార్డ్ తప్పనిసరి అని చెప్పవచ్చు.

    Pan Card

    ప్రస్తుతం ఆధార్ కార్డ్ సహాయంతో సులభంగా పది నిమిషాల్లోనే పాన్ కార్డును పొందే అవకాశం ఉంది. వస్తువుల క్రయవిక్రయాలకు సంబంధించి లావాదేవీ విలువ 2 లక్షల రూపాయలు దాటితే పాన్ కార్డ్ నంబర్ ను ఇవ్వాలి. 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నా పాన్ కార్డు ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ లో 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే పాన్ కార్డు ఉండాలి.

    Also Read:  మూవీ టికెట్స్ ధరలు.. ఏపీలో వాత.. తెలంగాణలో మోత..?

    ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి కూడా పాన్ కార్డ్ అవసరం అనే సంగతి తెలిసిందే. 10 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువ ఉన్న స్థిరాస్తులను కొనుగోలు చేయాలంటే పాన్ కార్డు అవసరం అనే సంగతి తెలిసిందే. బైక్ కాకుండా వేరే వాహనంను అమ్మడం లేదా కొనడం చేస్తే పాన్ కార్డ్ ఉండాలి. ఇతర దేశాలకు ప్రయాణించడానికి రూ.25,000 కంటే ఎక్కువ మొత్తం చెల్లించాలంటే కూడా పాన్ కార్డ్ కావాలి.

    హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లు 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం అయితే పాన్ కార్డును ఇవ్వాలి. పాన్ కార్డు లేకుండా ఈ లావాదేవీలు జరపడం సులభం కాదు. అందువల్ల పాన్ కార్డును తప్పనిసరిగా కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు.

    Also Read: AP Politics: కాపులను మోసం చేస్తుందెవరు.. ట్రెండింగ్ లో ఇద్దరు నేతలు?