Telangana Congress Party: కాంగ్రెస్ పార్టీ లో విభేదాలు కొత్తేమీ కాదు. అవి ఎప్పుడు ఉండేవి. అది రేవంత్ రెడ్డే అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డే అయినా నేతలంతా ఐక్యంగా ఉండటం కుదరదు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే మాకు చెప్పటం లేదని సీనియర్లు అలకపాన్పులు ఎక్కుతున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎర్రవెల్లిని రచ్చబండ వేదికగా చేసుకోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తనకు చెప్పలేదని తాను హాజరు కావడం లేదని చెప్పడం తెలిసిందే.
మరోవైపు టీఆర్ఎస్ బీజేపీ లు దూసుకుపోతున్నాయి. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి, రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ ను లెక్క చేయడం లేదు. దీంతో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఎర్రవెల్లి గ్రామంలో నిరసన చేపట్టి పార్టీకి జవసత్వాలు నింపాలని చూస్తున్నా సీనియర్లు మాత్రం సాగనివ్వడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం మరోసారి ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: మళ్లీ మునుపటి స్థితికి టీ కాంగ్రెస్..?
రాష్ర్టంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. విజయాలు కూడా సొంతం చేసుకుంటన్నారు. దీంతో కేసీఆర్ కూడా బీజేపీనే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుండటంతో కాంగ్రెస్ ను పూర్తిగా మరిచిపోయినట్లే అనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి నిర్ణయం ఏకపక్షం అని చెబుతూ అధిష్టానానికి లేఖలు రాయడం చూస్తుంటే వారు కూర్చున్న కొమ్మను వారే నరుక్కుంటున్నారని తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీని బాగు చేయడం ఎవరి వల్ల కాదని తెలుస్తోంది. సీనియర్లు అడ్డు పుల్లలు వేసినంత కాలం పార్టీ ముందుకు పోయే పరిస్థితి కనిపించడం లేదు. వారి ఎదుగుదలను వారే నాశనం చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై పలు కోణాల్లో ఆరోపణలు చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి:కాంగ్రెస్ లో అసంతృప్తుల గోల.. పార్టీ భవిష్యత్ ఎలా?