https://oktelugu.com/

Vijay Deverakonda’s Liger: సింహం బలం పులి తెగింపు కలిపితే లైగర్ !

Vijay Deverakonda’s Liger: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా, ఈ సినిమా టైటిల్ వెనుక చాలా కథ ఉంది. అసలు లైగర్ అనే పేరే కొత్తగా ఉంది అంటూ సినీ జనం కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపించారు. అసలు లైగర్ అంటే ఏంటంటే.. మగ సింహానికి – ఆడ పులికి పుట్టిన దాన్నే లైగర్ అంటారు. అంటే.. […]

Written By: , Updated On : December 29, 2021 / 10:40 AM IST
Follow us on

Vijay Deverakonda’s Liger: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా, ఈ సినిమా టైటిల్ వెనుక చాలా కథ ఉంది. అసలు లైగర్ అనే పేరే కొత్తగా ఉంది అంటూ సినీ జనం కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపించారు. అసలు లైగర్ అంటే ఏంటంటే.. మగ సింహానికి – ఆడ పులికి పుట్టిన దాన్నే లైగర్ అంటారు. అంటే.. సింహం బలం, పులి తెగింపు రెండూ లైగర్ లో ఉంటాయి.

Vijay Deverakonda's Liger

Vijay Deverakonda’s Liger

మరి బలమైన ఈ క్రూర మృగాలా కలయికలో పుట్టిన లైగర్ అంటే.. ప్రపంచంలోనే ఓ ప్రత్యేకత ఉంది. అలాంటి టైటిల్ తో పూరి ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా కాస్త వినూత్నంగా ఉంటుందట. అందుకే, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా అంచనాలు పెరిగాయి. హిందీ బయ్యర్లు ఈ సినిమా తీసుకోవడానికి భారీ మొత్తాన్నే ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.

హిందీలో ఈ సినిమాకు బాగా మార్కెట్ కావడానికి ఒక కారణం ఉంది. అనన్య పాండే హీరోయిన్ కావడం, అలాగే బాలీవుడ్ బడా నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామి కావడంతో హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా డైరెక్ట్ హిందీ సినిమా అనే ఫీలింగ్ ను కలిగించింది. ఇక విజయ్ దేవరకొండను పక్కా బాక్సర్ గా భారీ బిల్డప్ తో పూరి ఈ సినిమాలో చూపించబోతున్నాడు.

Also Read: ‘శ్యామ్ సింగ రాయ్’ సేఫ్ అయినట్లేనా?

పైగా ఈ క్లైమాక్స్ సినిమా కథనే మలుపు తిప్పుతుంది. కీలకమైన ఎమోషనల్ సన్నివేశం కూడా ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లోనే ఉండబోతుంది. ఇక ‘లైగర్’ సినిమాని ఏప్రిల్ లో విడుదల చేయాలనేది ప్లాన్. కానీ అది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి. అసలుకే మూడో వేవ్ అంటున్నారు. ఇప్పటికే థియేటర్స్ ను కూడా క్లోజ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది.

కానీ ఈ సినిమా కోసం విజయ్ కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ తో పాటు ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: తెలుగు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే..: ఎవరంటే..?

Tags