ఆ నేతలు మారరా..?: ఇలా అయితే బెజవాడలో గట్టెక్కేదెలా..?

రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే.. అవి ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకం. ప్రతిష్టాత్మకమే కాదు… ఆ ఎన్నికల్లో గెలుపొందాలంటే నాయకులు, క్యాడర్‌‌ సపోర్టు ఎంతో అవసరం. కేడర్‌‌ ముందుపడితేనే ఆ పార్టీ ఎన్నికల్లో సత్తా చాటగలుగుతుంది. ఇందుకు పైస్థాయిలో ఉన్న నేతలు వారిని మోటివేట్‌ చేస్తూ ఉండాలి. కానీ.. ఆ నేతలు కొట్టుకుంటుంటే.. ఇక కింది స్థాయి క్యాడర్‌‌లో ఎవరు భరోసా నింపుతారు. వారికి ఎవరు ఉత్సాహం ఇస్తారు..? ఇప్పుడు విజయవాడలో తెలుగుదేశం పార్టీ దుస్థితి అలానే తయారైంది. Also […]

Written By: Srinivas, Updated On : February 19, 2021 2:27 pm
Follow us on


రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే.. అవి ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకం. ప్రతిష్టాత్మకమే కాదు… ఆ ఎన్నికల్లో గెలుపొందాలంటే నాయకులు, క్యాడర్‌‌ సపోర్టు ఎంతో అవసరం. కేడర్‌‌ ముందుపడితేనే ఆ పార్టీ ఎన్నికల్లో సత్తా చాటగలుగుతుంది. ఇందుకు పైస్థాయిలో ఉన్న నేతలు వారిని మోటివేట్‌ చేస్తూ ఉండాలి. కానీ.. ఆ నేతలు కొట్టుకుంటుంటే.. ఇక కింది స్థాయి క్యాడర్‌‌లో ఎవరు భరోసా నింపుతారు. వారికి ఎవరు ఉత్సాహం ఇస్తారు..? ఇప్పుడు విజయవాడలో తెలుగుదేశం పార్టీ దుస్థితి అలానే తయారైంది.

Also Read: వారి ఆశలన్నీ గల్లంతే..!

మున్సిపల్ ఎన్నికల వేళ బెజవాడ తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గాలుగా విడిపోయిన ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇన్నాళ్లు చాపకింద నీరులా ఉన్న వర్గపోరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాక్షిగా వెలుగులోకి వచ్చాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో చేయాల్సిన వ్యాఖ్యలు.. రోడ్డుపైనే వినిపించడం తమ్ముళ్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది. గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా రేగిన వివాదం పార్టీని ఇరుకునపెట్టింది.

39వ డివిజన్ అభ్యర్థిని రాత్రికి రాత్రే ఎంపీ కేశినేని నాని మార్చడం తీవ్ర వివాదాస్పదమైంది. 39వ డివిజన్ అభ్యర్థిగా పూజితకు బీఫారం ఇచ్చి ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోమనడం సరైంది కాదంటూ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గం.. ఎంపీ కేశినేని నానిని నిలదీసింది. డివిజన్ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తీవ్రవాగ్వాదం జరిగింది. 11 నెలలుగా పార్టీకి అందుబాటులో ఉన్న పూజితను కాదని.. శివ అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేయించడంతో పూజితతో పాటు బుద్ధావెంకన్న వర్గం ఆందోళనకు దిగింది.

Also Read: భూముల అమ్మకంపై విపక్షాల ఫైర్‌‌ : విశాఖ ఫ్యాక్టరీని కాపాడుకునేదెలా..?

పార్టీ మారిన వాళ్లని టీడీపీలో ఎలా ప్రోత్సహిస్తారని బుద్ధా వర్గీయులు ప్రశ్నించడంతో వారికి ఘాటుగానే సమాధానమిచ్చారు కేశినేని నాని. నేను తప్పు చేస్తే పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేసుకోండని స్పష్టం చేశారు. అంతేకాదు గతంలో 23 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాం.. చంద్రబాబు చేసింది తప్పు కాదా అంటూ ప్రశ్నించారు. నడిరోడ్డుపై అడ్డుకొని వాగ్వాదం చేస్తే పార్టీకే నష్టమని కూడా సెలవిచ్చారు. అయితే.. విజయవాడలో కొంతకాలంగా కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య అస్సలు పడటంలేదు. గతంలో ట్విట్టర్ సాక్షిగా ఇద్దరు నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఓకే పార్టీలో ఉంటూ వేర్వేరు కుంపట్లు అన్నట్లుగా మెదులుతున్నారు. ఎంపీ కేశినేని నాని అయితే అప్పుడప్పుడు పార్టీ తీరునే తప్పుబట్టారు. లోక్ సభలో పార్టీ నాయకుడి విషయంలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు బెజవాడలో ఎన్నికల నగారా మోగడంలో మళ్లీ అసంతృప్తులు, పాత గొడవలు రాజుకున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్