మన దేశంలో పెట్రోల్ ధరలు ఎంతలా మండిపోతున్నాయో చూస్తున్నాం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సెంచరీ దాటిపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో సెంచరీకి చేరువలో ఉంది రేటు. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. బండి బయటకు తీయాలంటే భయపడిపోతున్నారు. అయితే.. మన దేశంలో ఇంతగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఇతర దేశాల్లో ఎలా ఉన్నాయి..? అసలు ఏ దేశంలో పెట్రోల్ రేటు చాలా తక్కువ? అనేది అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. అసలు ఇతర దేశాల్లో చూస్తే పెట్రోల్ ధరలు చాలా తక్కువ అనే చెప్పాలి.
Also Read: భూముల అమ్మకంపై విపక్షాల ఫైర్ : విశాఖ ఫ్యాక్టరీని కాపాడుకునేదెలా..?
కొన్ని దేశాల్లో వందల్లో పలుకుతున్న లీటర్ పెట్రో ధర.. మరికొన్ని దేశాల్లో మాత్రం చాలా చీప్. రూపాయి, రెండు రూపాయలకే లీటర్ పెట్రోల్ వస్తోంది. ఆ దేశాలేంటో ఇక్కడ చూద్దాం.
* వెనెజ్వెలా – 0.020 డాలర్లు ( రూ.1.45), ఇరాన్ – 0.062 డాలర్లు ( రూ.4.50), అంగోలా – 0.245 డాలర్లు (రూ.17.78), అల్జీరియా – 0.346 డాలర్లు (రూ. 25.10), కువైట్- 0.347 డాలర్లు (రూ. 25.18), సుడాన్ – 0.379 డాలర్లు (రూ. 27.50), కజక్‌స్థాన్ – 0.408 డాలర్లు (రూ. 29.60 ), ఖతార్ -0.412 డాలర్లు ( రూ. 29.89), తుర్కమెనిస్తాన్ – 0.428 డాలర్లు ( రూ.31.05), నైజీరియా – 0.435 డాలర్లు (రూ. 31.65), ఈక్వెడార్ – 0.464 డాలర్లు (రూ. 33.66), కిరిజిస్థాన్ -0.472 డాలర్లు ( రూ.34.34), మలేసియా – 0.486 డాలర్లు (రూ.35.26), యూఏఈ – 0.490 డాలర్లు (రూ.35.55), ఇరాక్ – 0.515 డాలర్లు (రూ. 37.36), సౌదీ అరేబియా – 0.517 డాలర్లు (రూ. 37.51), ఒమన్ – 0.525 డాలర్లు (రూ .38.09), బహ్రెయిన్ – 0.530 డాలర్లు (రూ.38.45), ఇథియోపియా – 0.537 డాలర్లు (రూ.38.96), బొలీవియా -0.542 డాలర్లు (రూ.39.32), బొలీవియా -0.542 డాలర్లు (రూ.39.32)గా ఉంది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు