టీఆర్‌‌ఎస్‌లో భయం మొదలైందా..? అందుకే ఆ స్థానానికి పోటీ చేయడం లేదా..?

తెలంగాణ మలి ఉద్యమం ప్రారంభం నుంచి తిరుగులేని నేత కేసీఆర్‌‌. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పార్టీ టీఆర్‌‌ఎస్‌. రాష్ట్రం సాధించే వరకైనా.. రాష్ట్రం సాధించాక అయినా టీఆర్‌‌ఎస్‌ పార్టీదే పైచేయి. ఎన్నికలు ఏవైనా.. వార్‌‌ వన్‌ సైడే. కేసీఆర్‌‌ ఒక్క సభ పెడుతున్నారంటే లక్షలాది జనం అక్కడ వాలిపోతుంటారు. ఆయన స్పీచ్‌కు ఫిదా అయిపోతుంటారు. ఆయన మాటల గారడికి ఒక్క తెలంగాణలోనే కాదు.. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానులు ఉన్నారు. రాజకీయాల్లోనూ చక్రం తిప్పగల అపర చాణక్యుడు. […]

Written By: Srinivas, Updated On : February 19, 2021 2:27 pm
Follow us on


తెలంగాణ మలి ఉద్యమం ప్రారంభం నుంచి తిరుగులేని నేత కేసీఆర్‌‌. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పార్టీ టీఆర్‌‌ఎస్‌. రాష్ట్రం సాధించే వరకైనా.. రాష్ట్రం సాధించాక అయినా టీఆర్‌‌ఎస్‌ పార్టీదే పైచేయి. ఎన్నికలు ఏవైనా.. వార్‌‌ వన్‌ సైడే. కేసీఆర్‌‌ ఒక్క సభ పెడుతున్నారంటే లక్షలాది జనం అక్కడ వాలిపోతుంటారు. ఆయన స్పీచ్‌కు ఫిదా అయిపోతుంటారు. ఆయన మాటల గారడికి ఒక్క తెలంగాణలోనే కాదు.. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానులు ఉన్నారు. రాజకీయాల్లోనూ చక్రం తిప్పగల అపర చాణక్యుడు. కానీ.. అలాంటి టీఆర్‌‌ఎస్‌ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఆ పార్టీ నుంచి పోటా చేసేందుకు క్యాండిడేట్లు పోటీ పడేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి అంతా రివర్స్‌.

Also Read: ఆ నేతలు మారరా..?: ఇలా అయితే బెజవాడలో గట్టెక్కేదెలా..?

తెలంగాణలో ప్రస్తుతం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక దానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించారు. మరో దానికి ఇంతవరకు ఊసెత్తలేదు. ఎందుకంటే అక్కడ పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. అంతేకాదు.. పోటీ చేసి పరువు తీసుకోవడం ఎందుకన్న సలహాలు ఇస్తున్నారట. దాంతో కేసీఆర్ కూడా పునరాలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. ఒకప్పుడు కేసీఆర్.. గ్రేటర్ ఎన్నికల్లో బలం లేక పోటీకి దిగేవారు కాదు. ఆ తర్వాత తిరుగులేని స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు వచ్చినట్లుగా కనిపిస్తోంది.

వరంగల్ ఖమ్మం, నల్గొండ స్థానానికి పల్లా రాజేశ్వరరెడ్డిని కేసీఆర్ బరిలోకి దించారు. ఆయన ప్రచారం కూడా ఉధృతంగానే నడుస్తోంది. కానీ.. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు టిక్కెట్ ఖరారు చేశారు. కానీ.. ఆయన తన వల్ల కాదని చేతులెత్తేశారు. తర్వాత గతంలో ఓడిపోయిన దేవీ ప్రసాద్‌ని పిలిచారు. ఓ సారి ఓడింది చాలని ఆయన కూడా సైలెంటయ్యారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ ఎప్పుడూ గెలవలేదు. ఉద్యమ సమయంలోనూ.. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా గెలవలేదు.

Also Read: వారి ఆశలన్నీ గల్లంతే..!

సొంత రాష్ట్ర ఏర్పడ్డాక 2015లో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఆ టైమ్‌లో ఎంతో నమ్మకంతో కాదు కాదు అపనమ్మకంతో టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న దేవీ ప్రసాద్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయించి మరీ బరిలోకి దింపారు. కానీ.. ఆయన ఓటమి పాలయ్యాడు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం తర్వాత మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన జీవన్ రెడ్డి అనూహ్య విజయం సాధించారు. ఈ పరిస్థితులన్నీ టీఆర్ఎస్‌ నేతల్లో పోటీకి దూరంగా ఉండాలన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి. అందుకే.. ఈ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు టీఆర్‌‌ఎస్‌ సాహసించడం లేదు. మరోవైపు ఈనెల 23 వరకే నామినేషన్ల స్వీకరణకు చాన్స్‌ ఉంది. ఇక అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్