అప్పు చేసి పప్పు కూడు ఎన్నాళ్లు జగన్?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో అంకెల గారడీ చేస్తోంది. ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువగా ఉండేలా తయారు చేసింది. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. దీంతో బడ్జెట్ అంచనాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని అనుమానిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రూ.2.30 లక్షల కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు చేసింది. సంక్షేమ రంగాకే ప్రాధాన్యం ఇచ్చింది. కానీ రాబడి మాత్రం చూసుకోలేదు. దీంతో తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు నిధులు […]

Written By: Srinivas, Updated On : May 23, 2021 2:16 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో అంకెల గారడీ చేస్తోంది. ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువగా ఉండేలా తయారు చేసింది. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. దీంతో బడ్జెట్ అంచనాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని అనుమానిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రూ.2.30 లక్షల కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు చేసింది. సంక్షేమ రంగాకే ప్రాధాన్యం ఇచ్చింది. కానీ రాబడి మాత్రం చూసుకోలేదు. దీంతో తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని నిపుణులు చెబుతున్నారు. మూడో సంవత్సరం కూడా అవసరాల కంటే సంక్షేమ పథకాలకే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. అయితే ఆదాయం లేకుండా ఇంత పెద్ద బడ్జెట్ ను ఎలా అమలు చేస్తారన్నదే ప్రశ్న. గత ఏడాది చూపించిన బడ్జెట్ లోనే దాదాపు 50 వేల కోట్ల మేర కోత పడినట్లు తెలుస్తోంది.

సంక్షేమమే ప్రధానంగా..
ఏపీ ప్రభుత్వం సంక్షేమ రంగమే ప్రధానంగా భావిస్తోంది. ఇందు కోసం బడ్జెట్ లో అధికంగా నిధులు కేటాయించింది. నవరత్నాలను మంచి కొత్త పథకాలకు రూపకల్పన చేసింది. దీంతో అన్ని వర్గాలకు చేరువ కావాలని చూస్తోంది. బడ్జెట్ ను చూస్తేనే అర్థమైపోతోంది. సంక్షేమ పథకాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఎక్కడా మిస్ కాకుండా వృత్తుల సాయం నగదు బదిలీ పకడ్బందీగా చేస్తున్నారు. అన్ని కులాలు, మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి అర్చకులు, ఫాస్టర్లు, ఇమామ్లకు గౌరవ వేతనాలు ఇస్తున్నారు. వీటన్నింటికి నిధులు సమకూర్చుకోవడం భవిష్యత్తులో కష్టమే అవుతుంది. ప్రజలు కూడా సంక్షేమ పథకాలకు అలవాటు పడిపోయారు. దీంతో ప్రభుత్వం సైతం ఏం చేయలేకపోతోంది. ఒకవేళ సంక్షేమ పథకాలను ఆపేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందుకే ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ బడ్జెట్2020-21 లో పన్ను రాబడి రూ.57 వేల కోట్లు మాత్రమే ఉంది. దాన్ని ఈ సంవత్సరం రూ.85 వేల కోట్లు పెంచారు. అంటే గత ఏడాది కేంద్ర సాయం రూ.37 వేల కోట్లు ఉంటే ఈ సంవత్సరం రూ.57 వేల కోట్లు వస్తుందని చూపించారు. ఈ రెండు పద్దుల్లో రూ.50 వేల కోట్ల వరకు సంఖ్యను పెంచి చూపించారు. అభివృద్ధి దాయకమైన ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబం పెట్టుబడి వ్యయం. కనీసం మూడింట ఒకవంతు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తే ఆదాయం పెరుగుతుంది. రూ.2.30 వేల కోట్లలో కనీసం రూ.76 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ రూ.36 వేల కోట్లు మాత్రమే ఉంది. గత ఏడాది రూ.30 వేల కో ట్లు పెట్టారు. కానీ అందులో రూ.19 వేల కోట్లే ఖర్చు చేసింది.

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ర్ట, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ర్టాలకు ఆదాయ వనరులు ఉండడంతో వాటి ఆదాయం పెరిగినా సమస్యలు రావడం లేదు. కానీ ఏపీలో ఆదాయ మార్గాలు లేకున్నా బడ్జెట్ విపరీతంగా పెంచేస్తూ అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లుగా చేస్తున్నారు. దీంతో ప్రజలపై భారం పడుతోంది. ప్రతి ఏటా ఆదాయం పెరుగుతూ వస్తోంది. రాబడి మాత్రం తగ్గుతోంది. దీంతో ఏం చేయాలో ఆలోచించకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తోంది. వ్యవసాయ రంగంపై పన్నులు వేసే అవకాశాలు లేవు. ప్రజలే పన్నులు భరించాల్సి రావచ్చు. ఏపీ అప్పులు రూ.3.80 వేల కోట్లకు చేరుకున్నాయి. స్థూల రాష్ర్ట ఉత్పత్తిలో37 శాతం రుణాల పద్దు ఉంది. ఇది 20 శాతానికి మించకూడదు. 25 శాతం దాటితే ప్రమాదమే. తాజా బడ్జెట్ లో 50 వేల కోట్లు అప్పులు తెస్తామంటూ ప్రభుత్వం చెప్పింది. ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయ మార్గాలు వెతుక్కోకుండా ప్రభుత్వాలు బడ్జెట్ రూపకల్పన చేస్తూ ప్రజలను పావులుగా చేస్తున్నారు.