VC Sajjanar: దిశ ఎన్ కౌంటర్ పై కమిషన్ విచారణ.. సజ్జనార్ బదిలీ అందుకేనా?

VC Sajjanar: ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న వీసీ సజ్జనార్ పై (VC Sajjanar) ఉచ్చు బిగుస్తోంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్లో నలుగురిని మట్టుబెట్టిన నేపథ్యంలో అప్పట్లో ఆయనపై ప్రశంసల జల్లు కురిసింది. రియల్ పోలీస్ గా జనం నీరాజనాలందించారు. నిందితులకు తగిన శాస్తి జరిగిందని సంబరాలు చేసుకున్నారు. అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ కేసులో సజ్జనార్ వ్యవహరించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ప్రస్తుతం ఆయనపై విచారణ కమిటీని […]

Written By: Srinivas, Updated On : August 28, 2021 12:55 pm
Follow us on

VC Sajjanar: ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న వీసీ సజ్జనార్ పై (VC Sajjanar) ఉచ్చు బిగుస్తోంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్లో నలుగురిని మట్టుబెట్టిన నేపథ్యంలో అప్పట్లో ఆయనపై ప్రశంసల జల్లు కురిసింది. రియల్ పోలీస్ గా జనం నీరాజనాలందించారు. నిందితులకు తగిన శాస్తి జరిగిందని సంబరాలు చేసుకున్నారు. అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ కేసులో సజ్జనార్ వ్యవహరించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ప్రస్తుతం ఆయనపై విచారణ కమిటీని నియమించిన నేపథ్యంలో మాజీ న్యాయమూర్తి సిర్పూర్కర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ నివేదక సమర్పించేందుకు విచారణ జరుపుతోంది.

జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ దిశ ఎన్ కౌంటర్ పై వివరాలు సేకరిస్తోంది. హైదరాబాద్ లోనే ఉండి తన విధులు నిర్వహిస్తోంది. ఇప్పటికే సిట్ ఇన్ చార్జి సురేందర్ రెడ్డిని ప్రశ్నించింది. హోంశాఖ కార్యదర్శి నుంచి వివరాలు తీసుకుంది. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలాలు సేకరించింది. ఎన్ కౌంటర్లో చనిపోయిన వారే నిందితులు అనడానికి గల ఆధారాలు సంపాదిస్తోంది. దీంతో సిట్ ఇచ్చిన సమాచారంతో కమిషన్ తన నివేదిక సమర్పించనుంది. ఈ నేపథ్యంలో సజ్జనార్ పై ఏవైనా చర్యలు తీసుకుంటారోననే అనుమానాలు నెలకొన్నాయి.

ఈక్రమంలో సీపీ సజ్జనార్ ను ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసింది. ఉదయమే నిర్ణయం తీసుకుని మధ్యాహ్నం రిలీవ్ కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో సజ్జనార్ కు ఏ రకమైన ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరించిందని తెలుస్తోంది. కానీ కమిషన్ కు ఎన్ కౌంటర్ బూటకమని నివేదిక సమర్పిస్తే సజ్జనార్ కు ఇబ్బందులు తప్పవనే నిర్ణయంతోనే ఈ విధంగా చేసిందనే సమాచారం.

సీపీ సజ్జనార్ గతంలో వరంగల్ నగరంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఓ యువతిపై యాసిడ్ దాడి చేసిన ఇద్దరిని ఎన్ కౌంటర్ చేసి తానేమిటో నిరూపించుకున్నారు. మెదక్ జిల్లాలో కూడా ఓ రౌడీషీటర్ ను కూడా ఇదే రకంగా ఎన్ కౌంటర్ చేసి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. దిశ నిందితులపై పెరుగుతున్న ప్రజల ఆగ్రహంతో వారిని కచ్చితంగా ఎన్ కౌంటర్ చేస్తారని అందరు భావించిన నేపథ్యంలో వారిని చంపడం తప్పేమీ కాదని అప్పట్లో అందరిలో హర్షం వ్యక్తం అయింది.