వైసీపీ మరోసారి రంగుల మాయ!

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రంగుల వివాదం తెరపైకి వచ్చింది. గతంలో గ్రామా సచివాలయ కార్యాలయాలకు వైసీపీ రంగు తొలగించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతంతో వైసీపీ జెండా కలర్ వచ్చే విధంగా ఆకుపచ్చ,తెలుపు,నీలం రంగులు వేశారు. ఇప్పుడు దానికి అదనంగా కాషాయ రంగు వేయడంతో మరోకొత్త వివాదానికి వైసీపీ తెరలేపాయినట్లయింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం హనుమాన్ ‌పాలెంలో ఓ పంచాయతీ ఆఫీస్ ‌కు కొత్తగా రంగులు […]

Written By: Neelambaram, Updated On : April 23, 2020 2:18 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రంగుల వివాదం తెరపైకి వచ్చింది. గతంలో గ్రామా సచివాలయ కార్యాలయాలకు వైసీపీ రంగు తొలగించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతంతో వైసీపీ జెండా కలర్ వచ్చే విధంగా ఆకుపచ్చ,తెలుపు,నీలం రంగులు వేశారు. ఇప్పుడు దానికి అదనంగా కాషాయ రంగు వేయడంతో మరోకొత్త వివాదానికి వైసీపీ తెరలేపాయినట్లయింది.

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం హనుమాన్ ‌పాలెంలో ఓ పంచాయతీ ఆఫీస్ ‌కు కొత్తగా రంగులు వేశారు. రంగులు వేసిన ఆఫీస్‌ ను వీడియో తీసి ఆయన ఫేస్‌ బుక్‌ లో పోస్ట్ చేశారు. తెలుపు రంగు-క్షీర విప్లవం, నీలం రంగు – చేపల పెంపకం, ఆకుపచ్చ రంగు – వ్యవసాయానికి ప్రతీక అంటూ చెప్పారని, కానీ వైసీపీ రంగులను ప్రతిబింబించేలా ఆ రంగులు ఉన్నాయని, అదనంగా కాషాయ రంగును వేశారని ఆయన అన్నారు. గతంలో కంటే ఇప్పుడు కేవలం కాషాయ రంగును మాత్రమే వేశారని దీనికి డబ్బుల వృథా తప్ప ఏం లేదని ఆయన అన్నారు. దీంతో ఏపీలో మళ్లీ రంగుల పై వివాదం రాజుకుంటుంది.