Telangana: రోజురోజుకూ చలి పంజా విసురుతుంది. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడి పోతున్నాయి. దీంతో ప్రజలు గడగడ వణుకు తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి రోజురోజుకూ పెరుగుతుంది. అక్కడి ప్రజలు తగ్గుతున్న ఉష్ణోగ్రతల కారణంగా బయటకి రావడానికి కూడా జంకుతున్నారు. చలి చంపేస్తుంది అనుకుంటే దానికి తోడు చలి గాలులు కూడా ప్రజలకు మరింత వణుకు తెప్పిస్తున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఏజెన్సీ ప్రాంతంలో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మరి రోజురోజుకూ కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరడంతో చలి తీవ్రత నుండి ప్రజలు తమని తాము కాపాడు కునేందుకు చలి మంటలు వేసుకుని కాస్త రిలీఫ్ అవుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం తూర్పు, ఈశాన్య దిక్కులా నుండి వీస్తున్న గాలుల కారణంగానే చలి తీవ్రత గత మూడు రోజులుగా పెరిగిందని చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రికార్డ్ స్థాయి లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో ఆ ప్రాంతంలో ప్రజలు చలికి వణుకు తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 9 డిగ్రీలకు పడిపోయింది. అదే జిల్లా సిర్పూర్ లో కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యింది.
Also Read: TRS: బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పక్కా ప్లాన్?
సోనాలలో 9.1, అర్లి లో 9.4, మంచిర్యాల జన్నారం లో 9.8 జిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం చలి దాటికి వణుకు తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలి తీవ్రతను తట్టుకోలేక పోతున్నారు. ఉద్యోగులకు, విద్యార్థులకు చలి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ చలి గాలుల ప్రభావం పంట పొలాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రజలు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితీ ఏర్పడింది. ఇంకా కొన్ని రోజులు ఇలాగె ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది.
Also Read: D Srinivas: డీఎస్ ఎందుకు కాంగ్రెస్ లో చేరలేదు.. ఆ గ్యాప్ కు కారణమిదే?