https://oktelugu.com/

ఆ గొప్ప నటి ఆనందంలోనూ దిగులుగానే క‌నిపించేవారు !

Actress Sujatha: ఆమెను పద్దతికి ప్రతిరూపం అనేవాళ్ళు. ఆ రోజుల్లో అనగా నలభై ఏళ్ల క్రితం ఆమెను చూసిన సినిమా వాళ్లంతా గుసగుసలాడే కునేవారు. అసలు ఈమె సినిమాల్లోకి ఎలా వచ్చి ఉంటుంది ? కారణం, సినిమా వాసన ఆమె దరిదాపుల్లో ఉండేది కాదు. ఆమె కూడా ఒక నటిలా ఎన్నడూ ప్రవర్తించలేదు. ఆమె… అలనాటి తార సుజాతగారు. సుజాత గారి కెరీర్ హీరోయిన్ గానే మొదలైంది. కానీ, ఆమె పెద్ద హీరోయిన్ కాలేకపోయింది. అయినప్పటికీ పెద్ద […]

Written By:
  • Shiva
  • , Updated On : December 18, 2021 / 03:34 PM IST
    Follow us on

    Actress Sujatha: ఆమెను పద్దతికి ప్రతిరూపం అనేవాళ్ళు. ఆ రోజుల్లో అనగా నలభై ఏళ్ల క్రితం ఆమెను చూసిన సినిమా వాళ్లంతా గుసగుసలాడే కునేవారు. అసలు ఈమె సినిమాల్లోకి ఎలా వచ్చి ఉంటుంది ? కారణం, సినిమా వాసన ఆమె దరిదాపుల్లో ఉండేది కాదు. ఆమె కూడా ఒక నటిలా ఎన్నడూ ప్రవర్తించలేదు. ఆమె… అలనాటి తార సుజాతగారు. సుజాత గారి కెరీర్ హీరోయిన్ గానే మొదలైంది. కానీ, ఆమె పెద్ద హీరోయిన్ కాలేకపోయింది. అయినప్పటికీ పెద్ద హీరోలందరూ ఆమెను పెద్ద హీరోయిన్లు కంటే ఎక్కువ గౌరవంగా చూసేవారు.

    Actress Sujatha

    తోటి నటీనటులు కూడా ఆమె పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపించేవారు. పైగా ఆమె ఎంతో గొప్ప నటి. కరుణ రసాన్ని సహజమైన కన్నీళ్ళతో చాలా సహజంగా తన హావభావాలతో పలికించేవారు. నిజానికి సుజాత గారికి సినిమాల్లో నటించాలని మొదటి నుంచి ఆసక్తి లేదు. పరిస్థితుల ప్రభావం కారణంగా సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. ఆమెను తమిళ వెండితెరకు దిగ్గజ దర్శకుడు కె. బాలచంద‌ర్ ప‌రిచ‌యం చేశారు. హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నా.. ఆమెకు సినిమా వాళ్ళ నైజం నచ్చేది కాదు.

    తనలో తానే ఎంతగానో మానసిక వేదనకు గురయ్యేవారు. అందుకే, కావాలని ఆమె సినిమాలను వదులుకునే వారు. ఆ కారణంగానే హీరోయిన్ గా సుజాత గారు ఎక్కువ చిత్రాలు చేయలేకపోయారు. ఆ త‌ర్వాత దాస‌రి నారాయ‌ణ రావు గారు ఆమె పరిస్థితి గమనించి.. మంచి పాత్ర‌లు ఇచ్చి సుజాతగారి స్థాయిని పెంచారు. అందుకే అనుకుంటా.. సుజాత గారంటే ఇప్పటికీ దాసరి గారితో చేసిన ‘ఏడంతుస్తుల మేడ’ సినిమానే జ్ఞప్తికి వస్తోంది.

    అలాగే ‘చంటి’ సినిమాలో ఆమె చేసిన వెంక‌టేశ్ త‌ల్లి పాత్ర‌ కూడా సుజాత గారి కెరీర్ లో గొప్ప పాత్రగా నిలిచిపోయింది. ఆ పాత్రలో ఆమె నటన అద్భుతం. అసలు ఆ రోజుల్లో ఎమోషనల్ పాత్రలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఒక్క ‘సుజాత’ గారే. పైగా ఆమె తెలుగు భాషకే పరిమితం కాలేదు. మలయాళం, తమిళ, కన్నడ భాషా చిత్రాల్లో కూడా తన భావోద్వేగమైన నటనతో ఎందరో హృదయాలలో చెదిరిపోని గుర్తులను మిగిల్చారు.

    Also Read: Shruti Haasan: బాలయ్య కోసం లుక్ మార్చబోతున్న శ్రుతి హాసన్ !

    అయితే, సుజాత గారు తన జీవితంలో ఓ దశలో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. బహుశా అందుకేనేమో ఆమె ముఖబింబం పై విషాదాంత కర సంఘటనలు, విషాద పాత్రలు అతి సహజంగా పలికి ఉంటాయి. ఐతే, సుజాత గారు కేవలం షూటింగ్ సమయంలోనే కాదు, ఆనందకరమైన అవార్డుల ఫంక్షన్ లోనూ ఎందుకో ఎప్పుడూ దిగులుగానే క‌నిపించేవారట. ఏది ఏమైనా తన మౌనం నుంచే కరుణ రసాన్ని చూపించడం ఒక్క సుజాత గారికి మాత్రమే సాధ్యం అయింది.

    Also Read: Pushpa: అక్కడ సరైన ప్రమోషన్స్​ లేకున్నా.. పుష్పరాజ్ అస్సలు​ తగ్గలేదుగా?

    Tags