Cold booming In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని ఆసిఫాబాద్ లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో చలి ప్రభావం అధికంగా పడుతోంది. మంచిర్యాలలో 12, నిర్మల్ లో 13.5, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లో సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా మినుములూరులో 10, పాడేరులో 12, అరకులోయలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం నిద్ర లేచేందుకు వణుకుతున్నారు. సూర్య కిరణాలు వస్తే కానీ బయటకు రావడం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. చలి నుంచి కాపాడుకోవాలి. స్వెటర్లు ధరించాలి. చలి నుంచి చర్మాన్ని రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. చలి సమయంలో బయటకు రావొద్దు. చలి ఎక్కువగా ఉండటంతో మనల్ని మనం రక్షించుకునే క్రమంలో పలు విధాలుగా చర్యలు తీసుకోవడం ఉత్తమం.
Also Read: Superstar Krishna Donating Organs: చనిపోయిన తర్వాత అవయవాలను దానం చేసిన సూపర్ స్టార్ కృష్ణ
చలి నుంచి మనం సంరక్షించుకునేందుకు గాను కొన్ని క్రీములు కూడా వాడుకోవాలి. చలికాలంలో చర్మం పొడిబారిపోతుంది. దీనికి గాను లోషన్లు వాడుకుని చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. పిల్లలకైతే నిండుగా దుస్తులు వేసి వారికి ఎలాంటి ఆపదలు రాకుండా చూడాలి. ఇందుకు గాను చలి నుంచి కాపాడుకునేందుకు ఉన్ని దుస్తులు ధరించుకోవాలి. తలకు కూడా ఏదైనా టోపీ లాంటిది వాడుకుంటే మంచిది. అలా చలి నుంచి రక్షించుకుని మనకు కలిగే ఇబ్బందులను తొలగించుకుంటే ప్రయోజనమే.

డిసెంబర్ లో చలి తీవ్రత ఇంకా పెరగనుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చలి నుంచి మనకు కష్టాలు రాకుండా చూసుకోవాలి. చలి కాలంలో మనం తీసుకునే ఆహారం తొందరగా జీర్ణం కాదు. దీంతో వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటేనే మంచిది. ఇందుకు గాను మనం తీసుకునే చర్యలు సమస్యలను దూరంగా ఉంచుతాయి. ఇందుకు గాను ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. త్వరగా జీర్ణం అయ్యే వాటిని తీసుకునేందుకు చొరవ తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఇబ్బందులు ఉండవు.
Also Read:Nagashaurya- Anusha Shetty: నాగశౌర్య భార్య అనూష శెట్టి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కిపోతారు
[…] […]