Superstar Krishna Donating Organs: తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రస్తావన సూపర్ స్టార్ కృష్ణ గారి నట జీవిత ప్రయాణం గురించి మొదలుపెట్టకుండా ప్రారంభం అవ్వదు.. ఎందుకంటే సరికొత్త జానర్స్ ని తెలుగు తెరకి పరిచయం చేసింది ఆయనే.. టెక్నాలజీ పరంగా ఇండస్ట్రీ ని మరోస్థాయికి తీసుకెళ్లి నిలబెట్టిన వ్యక్తి కూడా ఆయనే.. ఆయనలాంటి డేరింగ్ & డాషింగ్ హీరో నేటి తరం హీరోలలో ఒక్కరికి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.. అలాంటి మహామనిషి ఈరోజు మన అందరిని వదిలి తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడం అనేది ఇండస్ట్రీ కి తీరని లోటు.. కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగా కూడా ఆయన ఎంతోమందికి ఆదర్శం.

బ్రతికున్నన్ని రోజులు నలుగురి మంచి కోరుకుంటూ, అడిగినవారికి కాదానకుండా సహాయం చెయ్యడం వంటివి కృష్ణ గారి గొప్ప మనసుకి నిదర్శనం..ఆయనలో ఉన్న ఆ గొప్ప గుణమే ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కి కూడా వచ్చింది.. మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి వాళ్ళ పాలిట దేవుడిలా మారాదు.. ఇలాంటి పనులు చెయ్యడానికి కృష్ణ గారి ప్రభావం మహేష్ పై బలంగానే ఉంది.

ఇక కృష్ణ గారి గొప్ప మనసుకి అద్దం పట్టేలా మరో ఉదాహరణ ఇటీవలే బయటపడింది.. ఆయన చాలా కాలం క్రితమే చనిపోయిన తర్వాత తన శరీరం లో పనికొచ్చే అవయవాలు అన్నిటిని దానం చేసాడు.. కృష్ణ గారు చనిపోయిన తర్వాత డాక్టర్లు మొన్న ఆయన శరీరం లోని కొన్ని ముఖ్యమైన అవయవాలను తీసుకున్నారు.. దీనికి సంబంధించిన ఒక చిట్టీ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. సూపర్ స్టార్ మహేష్ బాబు అంగీకారం తెలిపిన తర్వాతే డాక్టర్లు అవయవాలను సేకరించారు.. చనిపోయిన తర్వాత కూడా పదిమందికి ఉపయోగపడాలి అనే గొప్ప మనసు అందరికి రాదు.. కానీ కృష్ణ తన జీవన పర్యంతం ఇలాంటి మహోన్నత కార్యక్రమాలు ఎన్నో చేసారు.. అలాంటి మహోన్నత వ్యక్తి ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాము.
[…] Also Read: Superstar Krishna Donating Organs: చనిపోయిన తర్వాత అవయవాలన… […]