https://oktelugu.com/

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని నిషేధించిన బీజేపీ

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ మానస పుత్రికలనే చెప్తారు ఎవరైనా. పత్రికా ప్రమాణాలు, టీవీ చానల్‌ నైతిక విలువలను గాలికొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ప్రసార సాధనంలా మారిపోయింది. అందుకే.. ఇప్పుడు ఆ పత్రిక, ఆ చానల్‌ను ఏపీ భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ బహిష్కరించింది. Also Read: చంద్రబాబుకు ఈసారి కష్టాలు తప్పవట? నిన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి, చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ ప్రయోజనాల […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 25, 2021 / 11:29 AM IST
    Follow us on


    ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ మానస పుత్రికలనే చెప్తారు ఎవరైనా. పత్రికా ప్రమాణాలు, టీవీ చానల్‌ నైతిక విలువలను గాలికొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ప్రసార సాధనంలా మారిపోయింది. అందుకే.. ఇప్పుడు ఆ పత్రిక, ఆ చానల్‌ను ఏపీ భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ బహిష్కరించింది.

    Also Read: చంద్రబాబుకు ఈసారి కష్టాలు తప్పవట?

    నిన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి, చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయించకుండా తిరిగి ఈ రోజు చర్చకు ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రయత్నించడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా మీడియా ముసుగులో పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్‌ను, ఆంధ్రజ్యోతి పత్రికను నేటి నుంచి బీజేపీ విలేకరుల సమావేశాలకు కూడా ఆహ్వానించరాదని, ఆ టీవీ చానల్ చర్చా కార్యక్రమాలలో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించింది.

    Also Read: వదిలేసిన జగన్.. షర్మిల పని అయిపోయినట్టేనా?

    రాష్ట్ర బీజేపీ ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ, ఏబీఎన్ ఛానల్ తనకు నచ్చిన వారిని ఆహ్వానించి, వారిని పార్టీ వాయిస్‌గా ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే, ఏబీఎన్ చానల్‌పై చట్టపరమైన చర్యలతోపాటు ఇతర అనువైన చర్యలకే బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా బీజేపీకి క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుంది. మొత్తంగా టీడీపీ మానస పుత్రిక అయిన ఆంధ్రజ్యోతిని బీజేపీ కూడా ఛీత్కరించుకోవాల్సిన పరిస్థితే వచ్చింది. ఆ పత్రిక, ఆ చానల్‌ వ్యవహారం అంతా ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చకు దారితీసింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్