CM Yogi Adityanath: భారత దేశ సామాజిక, ఆర్థిక విధానాలు, రాజకీయ వ్యవస్థపై దీన్‌దయాళ్ ఉపాధ్యాయ దార్శనిక ఆలోచనలు నేటికీ ఉన్నాయని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పండిత్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా అంత్యోదయపై చర్చించారు. ఆర్థిక ప్రగతికి క ఒలమానం సమాజంలో అడుగున ఉన్న వారిపై ఆధారపడకపోవడమే అని వ్యాఖ్యనించారు. ’హర్ హాత్ కో కామ్, హర్ ఖేత్ కో పానీ’ (ప్రతి చేతికి పని, ప్రతి క్షేత్రానికి నీరు) అని వాదించిన దీనదయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ భావన వెనుక దర్శనికత ఉందన్నారు. స్వాతంత్య్రం తరువాత, భారతదేశం తీసుకోవాల్సిన ప్రగతి చర్యలకు దీన్‌దయాళ్ కొత్త వెలుగు అయ్యారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన దీన్‌దయాళ్ మొదట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా, తరువాత భారతీయ జన్ సంఘ్ ద్వారా భారత సామాజిక, ఆర్థిక విధానాలు, రాజకీయ వ్యవస్థపై నాటి పాలకులకు దిశ, దశ చూపారని తెలిపారు.
పేదల ప్రగతే ఎజెండా..
పాలకులు బీజేపీ అయినా.. ఇతర పార్టీ నేతలైనా గ్రామాలు, పేదలు, రైతులు, మహిళల ప్రగతి లక్ష్యంగా పని చేయాలని దీన్‌దయాల్ నాడే సూచించారన్నారు. ఈ దృక్పథంలోనే దీన్‌దయాళ్ రాజకీయం చేశారని తెలిపారు. ఏడు దశాబ్దాల క్రితం దీన్‌దయాళ్ కన్న కలలను సాకారం చేసేందుకు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నేడు 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ దీన్‌దయాళ్ ఆలోచనే అని తెలిపారు. ఇంటింటికీ మరుగుదొడ్డి, ఆయుష్మాన్ భారత్ కూడా ఆయన ఆలోచన నుంచే వచ్చాయని వెల్లడించారు.
ప్రగతికి బాటలు..
దీన్‌దయాళ్ స్పూర్తితోనే కేంద్రంలోని మోదీ సర్కార్ దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తోందని తెలిపారు. ఆయన ఆలోచనల స్ఫూర్తితోనే పనిచేస్తోందని పేర్కొన్నారు. కొంత మంది దీన్‌దయాళ్‌ను దేశ వ్యతిరేకిగా ముద్రించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కానీ, దీన్‌దయాళ్ ఆలోచనా విధానం అందరూ తెలుసుకోవాలని సూచించారు. తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ భారతీయుడిపైనా ఉందని పేర్కొన్నారు.