https://oktelugu.com/

పవర్ – ఠాక్రే భేటీపై మహారాష్ట్రాలో రాజకీయ కలకలం

మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా నిత్యం ఏదో ఒక రాజకీయ సంక్షోభం ఎదురవుతూనే ఉంది. మొన్నటి వరకు ఆరు నెలలలోగా ఠాక్రే శాసన మండలికి ఎన్నిక కాగలరా అనే ఉత్కంఠత నెలకొనగా తాజాగా కరోనా కట్టడి చేయడంలో భాగస్వామ్య పక్షాల మధ్యనే విబేధాలు చెలరేగుతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. ఉద్ధవ్ థాకరేను ముంబై మాతోశ్రీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలుసుకొని గంటన్నర సేపు మంతనాలు జరపడంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 26, 2020 4:01 pm
    Follow us on


    మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా నిత్యం ఏదో ఒక రాజకీయ సంక్షోభం ఎదురవుతూనే ఉంది. మొన్నటి వరకు ఆరు నెలలలోగా ఠాక్రే శాసన మండలికి ఎన్నిక కాగలరా అనే ఉత్కంఠత నెలకొనగా తాజాగా కరోనా కట్టడి చేయడంలో భాగస్వామ్య పక్షాల మధ్యనే విబేధాలు చెలరేగుతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి.

    ఉద్ధవ్ థాకరేను ముంబై మాతోశ్రీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలుసుకొని గంటన్నర సేపు మంతనాలు జరపడంతో రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటె ఆయన అంతకు ముందే నిన్న సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని పవార్ కలుసుకున్నారు.

    పవర్ గవర్నర్ ను కలుసుకున్న ఆ వెంటనే బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే కూడా గవర్నర్‌ను కలుసుకున్నారు. కరోనాను కట్టడి చేయలేకపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తరుణంలో పవార్-ఉద్ధవ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    దేశం మొత్తంలో మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఆందోళనకరంగా ఉండడం, ముఖ్యంగా ముంబై నగరం మాస్కో నగరం తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు వస్తున్న నగరంగా పేరు పొందడంతో ఆందోళన కలిగిస్తున్నది. దేశంలోని కేసులలో ఆరొవంతు, కరోనా మరణాలలో నాలుగోవంతు ముంబై నగరం నుండే వస్తున్నాయి.

    శివ‌సేన నేతృత్వంలోని కూట‌మిలో చీల‌క‌లు వ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ ఇద్ద‌రూ భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. కానీ త‌మ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని శివ‌సేన స్ప‌ష్టం చేసింది. నిజానికి థాకరే, శ‌ర‌ద్ ప‌వార్‌లు గంట‌న్న‌ర సేపు చ‌ర్చించుకున్నార‌ని, ప్ర‌భుత్వ స్థిర‌త్వంపై ఎవ‌ర‌న్న కామెంట్ చేశారంటే, అది వారి క‌డుపు నొప్పిగా భావించాల‌ని సంజ‌య్ రౌత్ విమ‌ర్శించారు. త‌మ ప్ర‌భుత్వం బ‌లంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దీంట్లో ఎటువంటి ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని స్పష్టం చేశారు.

    లాక్‌డౌన్ ఎత్తివేయకపోతే ఆర్ధికంగా కోలుకోవడం కష్టమని పవార్ చెప్పడం థాకరేకు నచ్చలేదని తెలుస్తోంది. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు థాకరే విముఖంగా ఉన్నారు. ఈ అంశంలో ఇద్ద‌రి మ‌ధ్య భేదాభిప్రాయాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ త‌మ మ‌ధ్య ఎటువంటి స‌మ‌స్య‌లు లేవ‌ని రెండు పార్టీలు స్ప‌ష్టం చేశాయి. అధికారం కోసం కాచుకు కూర్చున్న బీజేపీయే ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు రెండు పార్టీలు పేర్కొన్నాయి.